పునరుత్థానం యొక్క 10 ఫలితాలు

షేర్ చెయ్యండి:

“మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టెయొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమైయున్నాము.” (1 కొరింథీ 15:17)

యేసు పునరుత్థానానికి మనం ఋణపడి ఉన్నామనుటకు ఇక్కడ అద్భుతమైన పది విషయాలు ఉన్నాయి:

1) మరి ఎన్నటికి చనిపోని రక్షకుడు. “మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు…” (రోమా. 6:9).

2) మారుమనస్సు. “మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించియున్నాడు” (అపొ. కార్య 5:30-31).

3) నూతన జన్మ. “మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను” (1 పేతురు 1:3).

4) పాప క్షమాపణ. “క్రీస్తు లేప బడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనేయున్నారు.” (1 కొరింథీ 15:17).

5) పరిశుద్ధాత్ముడు. “ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మనుగూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు” (ఆపొ. కార్య 2:32-33)

6) ఎన్నుకొనబడినవారికి ఏ శిక్షా విధి లేదు.“శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే” (రోమా 8:34).

7) యేసుతో వ్యక్తిగత సహవాసం మరియు సంరక్షణ. “ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను” (మత్తయి 28:20). 

8) రాబోవు తీర్పునకు రుజువు. “ఎందుకనగా తాను (దేవుడు) నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చబోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు” (అపొ. కార్య 17:31).

9) దేవుని భవిష్యత్ ఉగ్రత నుండి రక్షణ. “…దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని (మనము) యెదురు చూచుటకును,…” (1 థెస్స 1:10; రోమా 5:9).

10) మృతులలోనుండి మనం పునరుత్థానమగుట.ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడ లేపి,మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని [మనకు తెలుసు]” (2 కొరింథీ 4:14; రోమా 6:4; 8:11; 1 కొరింథీ 6:14; 15:20). 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...