రాబోవు ఉగ్రతలో పరలోక విశ్రాంతి

షేర్ చెయ్యండి:

“ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే”. (2 థెస్సలొనీకయులు 1:6–8)

దేవుని సహనం అయిపోయే సమయం వస్తుంది. దేవుడు తన ప్రజలు నిర్ణీత సమయం బాధలు పడటం చూసినప్పుడు, మరియు దేవుడు నిర్ణయించిన అమరవీరుల సంఖ్య పూర్తి అయినప్పుడు (ప్రకటన 6:11), పరలోకం నుండి దేవుని న్యాయమైన మరియు పవిత్రమైన ప్రతీకారం వస్తుంది.

తన ప్రజలను బాధపెట్టిన వారిపై దేవుడు ప్రతీకారం తీర్చుకోవడం మనకు “విశ్రాంతి” అనుభవమని గమనించండి. “మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.” మరో మాటలో చెప్పాలంటే, మనల్ని బాధపెట్టేవారిపై దేవుని తీర్పు మన పట్ల దేవుడు చూపిస్తున్న కృపకు నిదర్శనం.

బహుశా దేవుని తీర్పు మనపట్ల దేవుడు చూపిస్తున్న కృప అనడానికి అత్యంత విశేషమైన ఉదాహరణ ప్రకటన 18లోని బబులోను యొక్క విధ్వంసం. బబులోను నాశనానికి, పరలోకం నుండి ఒక గొప్ప స్వరం ఇలా అరిచింది, “పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు! ” (ప్రకటన 18:20). బహు జనులశబ్దమువంటి గొప్పస్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును; ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను;”(ప్రకటన 19:1-2).

దేవుని సహనానికి దీర్ఘశాంతము ముగిసినప్పుడు, ఈ యుగం ముగిసినప్పుడు, దేవుని ప్రజల శత్రువులపై తీర్పు వచ్చినప్పుడు, పరిశుద్ధులు దేవుని న్యాయాన్ని నిరాకరించరు.

పశ్చాత్తాపపడని వారి అంతిమ నాశనము దేవుని ప్రజలకు భాదను కలుగజేయదని దీని అర్థం.

ఇతరులు పశ్చాత్తాపపడటానికి ఇష్టపడకపోవడం వలన పరిశుద్ధుల ప్రేమ బంధించబడదు. నరకం పరలోకాన్ని దుఃఖంలోకి దింపేలాగా బెదిరించదు. దేవుని తీర్పు ఆమోదించబడుతుంది మరియు పరిశుద్ధులు సత్యం యొక్క నిరూపణను గొప్ప కృపగా అనుభవిస్తారు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...