జ్ఞాపకం చేసుకోవడానికి పోరాటం.

షేర్ చెయ్యండి:

“నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము”. (విలాప 3:21-22)

నిరీక్షణకున్న ఒకానొక అతి పెద్ద శత్రువు ఏంటంటే దేవుని వాగ్దానములను మరిచిపోవడం. వాటిని జ్ఞాపకం చేసుకోవడం  అనేది గొప్ప పరిచర్య. అందుకే  వారు పత్రికలను వ్రాసారని పేతురు మరియు పౌలు గార్లు చెప్పారు
(2 పేతురు 1:13; రోమా 15:15).

మనం జ్ఞాపకం చేసుకోవాల్సినవాటిని మనకు జ్ఞాపకం చేయడంలో ముఖ్య సహాయకుడు పరిశుద్ధాత్ముడే (యోహాను 14:26). అందుకని, మీరు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయకుండా ఉండాలని అర్థం కాదు. జ్ఞాపకముంచుకునే పరిచర్యకు మీరే బాధ్యులు. జ్ఞాపకం చేసుకునే అవసరతలో ఉన్న మొదటి వ్యక్తి కూడా మీరే.

మనస్సుకు ఇటువంటి గొప్ప శక్తి ఉంది: జ్ఞాపకం చేసుకునే విధానం ద్వారా అది తనతో తానే మాట్లాడుకోగలదు. “నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము” (విలాప 3:21-22) అని వాక్యం చెబుతున్నట్లుగా “జ్ఞాపకం చేసుకోవడానికి” మనస్సుకు మనస్సు పిలుపునివ్వగలదు.

దేవుడు, తన గురించి, మన గురించి చెప్పిన విషయాలను “జ్ఞాపకం చేసుకోవడానికి” మనం మనస్సుకు పిలుపునివ్వకపోతే, మనం చాలా ఇబ్బంది పడతాం. బాధాకరమైన అనుభవం నుండి ఇది నేను తెలుసుకున్నాను! మీ తలలో ఉన్నటువంటి భక్తిహీనమైన సందేశాల బురదలో, అంటే “నేను చేయలేను…” “ఆమె చేయలేదు…” “వాళ్ళు చేయలేరు…” “ఈ విధంగా పని జరగదు” అనే భక్తిహీనమైన (దేవుడు లేని) సందేశాలతో కూరుకుపోకండి.

ఇవన్నీ సరియైనవా లేక సరియైనవి కావా అనేది ఇక్కడ విషయం కాదు. మీరు మరింత ప్రాముఖ్యమైనవాటిని “గుర్తుంచుకోకపోతే”  మీ ఆలోచనలు వాటిని నిజం చేస్తాయి. అసాధ్యమైనవాటిని సుసాధ్యం చేసే దేవుడు, మనం నమ్మిన దేవుడు. మీకు అసాధ్యమనిపించే పరిస్థితుల నుండి నుండి బైటపడడానికి ప్రయత్నించడం కంటే దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలడని గుర్తుచేసుకోవడం ప్రభావవంతమైనది.

దేవుని జ్ఞానం, శక్తి, కృప మరియు ఆయన గొప్పతనం అనే సుగుణాలను మనం జ్ఞాపకం చేసుకోకపోతే, మనం క్రూరమైన, పశుప్రాయమైన నిరాశావాదంలోకి జారుకుంటాం. “నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని” (కీర్తన 73:22).

నిరాశ నుండి నిరీక్షణ వైపుకు తిరిగే గొప్ప మలుపు కీర్తన 77లోని ఈ మాటల ద్వారా తెలుస్తుంది: యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును” (కీర్తన 77:11-12).

ఇదే నా జీవితంలో ఉన్నటువంటి గొప్ప పోరాటం. మీ జీవితంలో కూడా ఈ పోరాటముందని నేననుకుంటున్నాను. ఆ పోరాటం నాకు నేను జ్ఞాపకం చేసుకోవడానికి, ఇతరులకు జ్ఞాపకం చేయడానికి ఉండే పోరాటం!

Samskarana

Samskarana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...