కృపా స్వాతంత్ర్యం

కృపా స్వాతంత్ర్యం

షేర్ చెయ్యండి:

అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమైయుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతో కూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము, క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను”. (ఎఫెసీ 2:4-7)

మార్పు చెందినప్పుడు దేవుని నిర్ణయాత్మకమైన చర్య ఏంటంటే “మన అపరాధములలో మనముండగానే” దేవుడు “క్రీస్తుతో కూడా మనల్ని జీవింపజేయడమే.” మరొక విధంగా చెప్పాలంటే, మనం దేవుని దృష్టిలో చనిపోయినవారం. మనం స్పందించని స్థితిలో ఉన్నవారం; మనకు నిజమైన ఆధ్యాత్మిక రుచి గురించి తెలియనివారం, లేక ఆధ్యాత్మిక ఆసక్తి లేనివారం; క్రీస్తు అందాన్ని (లేక, ఆయన సుగుణాలను) చూసేందుకు ఆధ్యాత్మిక నేత్రాలు లేనివారం; అంతిమంగా అతి ప్రాముఖ్యమైన విషయాలపట్ల మనం చనిపోయిన స్థితిలో ఉన్నవారం.

ఆ తర్వాత, దేవుని సన్నిధికి సరిపోవు పాత్రలుగా ఉండటానికి మనమేదైనా చేయడానికి ముందే ఆయన షరతులు లేనటువంటి ప్రేమను చూపించాడు. ఆయన మనల్ని జీవింపజేశాడు. క్రీస్తు మహిమను చూసేందుకు తండ్రియైన దేవుడు మన ఆధ్యాత్మిక మరణపు నిద్ర నుండి మేల్కొలిపాడు (2 కొరింథీ. 4:4). చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము అద్భుతమైన రీతిలో జీవములోనికి వచ్చింది.

దీన్నే ఎఫెసీ. 2:4వ వచనం “కరుణ” చూపే చర్య అని చెబుతోంది. అంటే, మనం అపరాధములచేత చనిపోయిన స్థితిలో ఉన్నామని దేవుడు చూసి, మనపట్ల జాలి చూపించాడు. నిత్య మరణానికి, నిత్య నాశనానికి నడిపించే పాపానికి వచ్చే భయంకరమైన జీతాన్ని దేవుడు చూశాడు. “…దేవుడు కరుణా సంపన్నుడైయుండి,… మనలను బ్రతికించెను.” మన అవసరతలో ఆయన కరుణ సమృద్ధిగా పొంగి పొర్లింది. ఈ వాక్యభాగములో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే “మీరు కృపచేతనే రక్షించబడియున్నారు” అనే మాటను జోడించి చెప్పడానికి ఆయన వ్రాస్తున్న వాక్యాన్ని విడగొట్టి చెప్పాడు.” “దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను….కృపచేత మీరు రక్షించబడియున్నారు మరియు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడు.”

ఈ విషయాన్ని పౌలు గారు 8వ వచనంలో మరలా చెబుతున్నాడు. అందుచేత, ఇక్కడ ఆ మాటను చేర్చి వ్రాయడానికి  ఆయన వ్రాస్తున్న విషయాన్ని ఆపి ఎందుకని ఆలోచనని మారుస్తున్నాడు? ఎందుకంటే, చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మన విషయమై స్పందించిన దేవుని కరుణ మీద దృష్టి సారించాడు; కాగా, కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నామనే విషయాన్ని పౌలు ఎందుకు బయట పెట్టాడు?

ఉచిత కృప గురించి నొక్కి చెప్పడానికి సరియైన అవకాశం ఇదేనని పౌలు గుర్తించి ఉంటాడన్నదే జవాబని నేననుకుంటున్నాను. మారుమనస్సు పొందక ముందు మన చచ్చిన స్థితిని ఆయన వివరిస్తుండగా, చనిపోయినవారు షరతులను పాటించలేరని ఆయన అర్థం చేసుకున్నాడు. చచ్చిన స్థితిలో ఉన్నవారు జీవించాలంటే, అక్కడ పూర్తిగా షరతులేని స్థితి ఉండాలి, వారిని రక్షించడానికి పూర్తిగా దేవుని ఉచిత కార్యం జరగాలి. ఈ స్వతంత్రం ఆ ఉచిత కృపకు సంబంధించిందే. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మరణం నుండి మరొకరిని లేపడం కంటే ఏకపక్షంగా స్వేచ్ఛగా మరియు బేరసారాలు లేని ఏక పక్షమైన ఉచితమైన చర్య ఇది! కృపకున్న అర్థం ఇదే.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...