# samskarana.co.in ## Posts - [మరణం గురించి రిహార్సల్](https://samskarana.co.in/rehearsal-about-death/): “వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.. . . . మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము”. (కీర్తన 90:5–6, 12) నాకు, సంవత్సర ముగింపు అంటే నా ముగింపు లాంటిది. మరియు డిసెంబర్ 31 రాత్రి 11:59 నా మరణ క్షణం లాంటిది. సంవత్సరంలో 365 రోజులు చిన్న జీవితకాలం లాంటిది. మరియు ఈ ఆఖరి ఘడియల అంతం చాలా దగ్గరలో ఉందని డాక్టర్ నాకు చెప్పిన తర్వాత ఆసుపత్రిలో చివరి రోజుల్లాగా ఉన్నాయి. మరియు ఈ చివరి గంటల్లో, ఈ సంవత్సర జీవితకాలం నా కళ్ళ ముందు అలా గడిచిపోయాయి మరియు నేను అనివార్యమైన ప్రశ్నను ఎదుర్కున్నాను: నేను బాగా జీవించానా? నీతిమంతుడైన న్యాయాధిపతియైన యేసుక్రీస్తు “నమ్మకమైన మంచి దాసుడా” (మత్తయి […] - [అలంకరించబడి, శక్తితో నింపబడ్డావు!](https://samskarana.co.in/adorned-and-empowered/): “గొఱ్ఱల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్”‌. (హెబ్రీయులు 13:20–21) క్రీస్తు నిత్య నిబంధన రక్తాన్ని చిందించాడు. ఈ విజయవంతమైన విమోచన ద్వారా, ఆయన చనిపోయినవారి నుండి తన స్వంత పునరుత్థానం యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు. అది ఇంగ్లీషులో ఉన్నదాని కంటే గ్రీకులో మరింత స్పష్టంగా ఉంది: “దేవుడు . . . మన ప్రభువైన యేసును మృతులలోనుండి తిరిగి తెచ్చెను . . . శాశ్వతమైన నిబంధన రక్తం ద్వారా. ఈ యేసు – నిబంధన రక్తం ద్వారా లేపబడ్డాడు – ఇప్పుడు మన ప్రభువు సజీవుడు మరియు మన కాపరి. మరియు వీటన్నిటి కారణంగా, దేవుడు […] - [భయంకరమైన విధి](https://samskarana.co.in/a-terrible-fate/): . . . “రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు”. (1 థెస్సలొనీకయులు 1:10) మీరు చిన్నతనంలో తప్పిపోయిన సమయమును, లేదా కొండ చరియలు మిమ్మల్ని దాటి పడిపోవడాన్ని లేదా మునిగిపోయే సమయాలు మీకు గురతున్నాయా? అప్పుడు అకస్మాత్తుగా మీరు రక్షించబడ్డారు. మీ “ప్రియమైన జీవితం” కోసం పోరాడారు. మీరు దాదాపు కోల్పోతారేమో అని మీరు వణికిపోయారు. మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఆహా!, చాలా సంతోషం మరియు ధన్యవాదాలు. మరియు మీరు ఆనందంతో వణికిపోయారు. సంవత్సరం చివర్లో, దేవుని ఉగ్రత నుండి రక్షించబడిన నేను కూడా అలానే భావిస్తున్నాను. క్రిస్మస్ రోజు మొత్తం మేము చలిమంట వేసి కూర్చొన్నాము. కొన్నిసార్లు బొగ్గు చాలా వేడిగా ఉన్నందున, నేను దానిని కాల్చినప్పుడు నా చేతికి గాయమైంది. నరకంలో, పాపానికి వ్యతిరేకంగా దేవుని ఉగ్రతను గూర్చిన భయంకరమైన ఆలోచనలతో నేను వెనక్కి తిరిగి వణుకుతున్నాను. అది ఎంత భయంకరంగా ఉంటుందో […] - [మహిమయే గురి](https://samskarana.co.in/aim-should-be-his-glory/): “మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము”. (రోమా 5:2) దేవుని మహిమను చూడడమే మన అంతిమ నిరీక్షణ. ” దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.” (రోమా ​​5:2). దేవుడు “తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెడతాడు” (యూదా 24). “మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల…. తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?” (రోమా ​​9:23). “తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవుడు” (1 థెస్సలొనీకయులు 2:11). “శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు” (తీతు 2:12-13). యేసు, ఒక వ్యక్తిగా  మరియు తన పనిలో, దేవుని మహిమ యొక్క మానవ జన్మ మరియు అంతిమ ప్రత్యక్షత. “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క […] - [మీ లక్ష్యం ఏమిటి?](https://samskarana.co.in/what-is-your-goal/): “కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.. . . . మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి”. (1 కొరింథీ. 10:31; కొలస్సీ. 3:17) మీరు ఉదయాన్నే లేచి, ఎటువంటి ఆశలు కలిగి ఉంటారు? ప్రారంభం నుండి చివరి వరకు ఒక రోజుని గమనించినప్పుడు, మీరు జీవించినదానికి ఏమి జరగాలనుకుంటున్నారు?  “నేను ఎప్పుడు అలా ఆలోచించను. నేను లేచి చేయవలసింది చేస్తాను” అని మీరు చెబితే, అప్పుడు మీరు కృపకు మూలమైన మరియు మార్గానికి, బలమునకు, ఫలించడానికి మరియు ఆనందమునకు మూలమైన దానినుండి మిమ్మల్ని మీరు వేరుచేసుకుంటున్నారు. బైబిల్‌లో మరియు అలాగే ఈ వాక్యాలలో స్పష్టంగా దాని గురించి వ్రాయబడి ఉంది. మనం బ్రతికినన్ని రోజులు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం విషయంలో దేవుడు […] - [విపత్తును గూర్చి ఎలా ఆలోచించాలి](https://samskarana.co.in/how-to-think-about-disaster/): “మృత్యువుయొక్క అలలు నన్ను చుట్టుకొనగనువరదపొర్లువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను. . . . దేవుడు యథార్థవంతుడు.” (2 సమూయేలు 22:5, 31) ప్రకృతి వైపరీత్యం కారణంగా తన పది మంది పిల్లలను కోల్పోయిన తర్వాత (యోబు 1:19), యోబు ఇలా అన్నాడు, “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతికలుగునుగాక.” (యోబు 1:21). పుస్తకం చివరలో, ప్రేరణ పొందిన రచయిత ఏమి జరిగిందో యోబుకు ఉన్న అవగాహనను ధృవీకరిస్తాడు. అప్పుడు అతని సహోదరులందరును అతని అక్క చెల్లెండ్రందరును “యెహోవా అతనిమీదికి రప్పించిన సమస్తబాధను గూర్చి యెంతలేసి దుఃఖములు పొందితివని అతనికొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి” (యోబు 42:11). ఇది మనకు అనేక పాఠాలను నేర్పిస్తుంది – కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇక్కడ మనకు పాఠాలు – ప్రపంచంలో మరియు మన జీవితాలలో సంభవించే విపత్తుల గురించి మనం ఆలోచించినప్పుడు – డిసెంబర్ 26, 2004 […] - [మూడు క్రిస్మస్ బహుమతులు](https://samskarana.co.in/3-christmas-gifts/): “చిన్న పిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు”. (1 యోహాను 3:7-8; 2:1-2) ఈ అద్భుతమైన పరిస్థితిని నాతో పాటు ఆలోచించండి. దేవుని కుమారుడు మీరు పాపం చేయకుండా ఆపడానికి అంటే సాతాను యొక్క పనులను నాశనం చేయడానికి వచ్చినట్లయితే, అలాగే  మీరు పాపం చేసినప్పుడు, ప్రాయశ్చిత్తం అంటే దేవుని ఉగ్రతను తీసివేయడానికి వచ్చినట్లయితే, అలాంటప్పుడు మన అనుదిన జీవితంలో ఈ సత్యాల ప్రభావం ఏంటి? మూడు విషయాలు. మరియు […] - [క్రిస్మస్ యొక్క రెండు లక్ష్యాలు](https://samskarana.co.in/two-goals-of-christmas/): “చిన్న పిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను”. (1 యోహాను 3:7–8) 1 యోహాను 3:8, “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.” అని చెప్పినప్పుడు, ఆయన మనస్సులో ఉన్న “అపవాది పనులు” ఏమిటి? ఈ సందర్భం చదివితే సమాధానం దొరుకుతుంది. మొదటిది, 1 యోహాను 3:5 పై వాక్యానికి సమానమైన వాక్యం: “పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును;” 5వ వచనంలో మరియు 8వ వచనంలో “ఆయన ప్రత్యక్షమాయెనని” ఉంది. కాబట్టి యేసు నాశనం చేయడానికి వచ్చిన “అపవాది యొక్క క్రియలు” చాలావరకు పాపాలు. 8వ వచనంలోని మొదటి భాగం దీనిని నిర్ధారిస్తుంది: “అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు […] - [వర్ణించలేని దేవుని బహుమతి](https://samskarana.co.in/uncomprehensive-gods-gift/): “ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరినిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొందియున్నాము”. (రోమా 5:10-11) దేవునిలో సమాధానమును మరియు ఆనందమును మనం నిజంగా ఎలా పొందగలము? మనము యేసు క్రీస్తు ద్వారా మాత్రమే పొందగలము. కనీసం, మనం బైబిల్‌లో యేసు చిత్రపటాన్ని – అంటే, కొత్త నిబంధనలో చిత్రీకరించబడిన యేసు కార్యాలను మరియు బోధలను – దేవునిలో మన ఉల్లాసానికి అవసరమైన విషయముగా మనం చేసుకుంటామని దీనర్థం. క్రీస్తు గురించి తెలుసుకోకుండా దేవునిలో ఆనందించడం ద్వారా క్రీస్తు గౌరవించబడడు. మరియు క్రీస్తు గౌరవించబడని చోట దేవుడు గౌరవించబడడు. 2 కొరింథీ. 4:4-6లో, పౌలు తన మార్పును రెండు విధాలుగా వివరించాడు. 4వ వచనంలో, “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను” […] - [మీరు నమ్మడానికే!](https://samskarana.co.in/you-have-to-believe/): “మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను”. (యోహాను 20:30-31) సంఘంలో పెరిగిన మనకు మరియు నిద్రలో కూడా మన విశ్వాసం యొక్క గొప్ప సిద్ధాంతాలను పఠించగలిగి, అపొస్తలుల విశ్వాసాన్ని సునాయాసంగా వివరించే మనము, ఎవరి ద్వారా సమస్తము సృష్టించబడిందో, ఎవరు తన శక్తిగల మాట ద్వారా విశ్వాన్ని నిర్వహిస్తున్నారో, నిత్యత్వం నుండి తండ్రి ద్వారా జన్మించిన, దేవుని మహిమను ప్రతిబింబిస్తున్న, దేవుని యొక్క ప్రతిరూపమైన, ఆ దేవుని కుమారుని యందు విస్మయమును, భయమును, ఆశ్చర్యమును, అద్భుతమును మరోసారి అనుభవించేలా మనకు సహాయం చేయడానికి ఏదైనా చేయాలి అని నేను చాలా బలంగా భావిస్తున్నాను.  ఇప్పటివరకు వ్రాసిన అనేక అబ్బురపరిచే కథలను, అనేక మిస్టరీ థ్రిల్లర్‌లను, అనేక దెయ్యం కథలను మీరు […] - [పురాతన కాలము నుండి ఉనికిలో ఉన్న వ్యక్తి పుట్టుక](https://samskarana.co.in/the-birth-of-a-person-who-has-existed-since-ancient-times/): “అందుకు పిలాతు – నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు – నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను”. (యోహాను 18:37) ప్రారంభంలో కాకుండా భూమిపై యేసు జీవితంలోని చివరి క్షణాల్లో వచ్చినప్పటికీ ఇది గొప్ప క్రిస్మస్ వచనం. గమనించండి: యేసు తాను పుట్టాడని మాత్రమే కాదు, ” లోకమునకు వచ్చితిని” అని చెప్పాడు. ఆయన జన్మలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన పుట్టుక తన జీవితానికి ఆరంభం కాదు. ఆయన తొట్టిలో పుట్టకముందే ఉన్నాడు. నజరేయుడైన యేసు యొక్క వ్యక్తిత్వం, గుణం, స్వభావం ఆయన మనిషిగా పుట్టకముందే ఉన్నాయి. ఈ రహస్యాన్ని వివరించడానికి ఉపయోగించే పదం అవతారం. కేవలం శరీరంగా మాత్రమే కాదు గాని వ్యక్తిగా వచ్చాడు. అయితే యేసు మనిషిగా పుట్టకముందే ఆయన యొక్క ముఖ్యమైన వ్యక్తిత్వం ఉనికిలో ఉంది. […] - [క్రిస్మస్ సంఘీబావం](https://samskarana.co.in/christmas-solidarity/): “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను”. (1 యోహాను 3:8) సాతాను ప్రతిరోజూ కోట్లలో పాపాలను తన కంపెనీలో సమీకరించి వాటిని భారీ కార్గో విమానాల్లోకి సర్దుకుని పరలోకానికి తీసుకొని వెళ్ళి దేవుడి ముందు విప్పి నవ్వుతూ ఉంటాడు. కొంతమంది ఈ పనిలో పూర్తి సమయం పని చేస్తారు. మరికొందరు అక్కడ ఉద్యోగాలు మానేసి ఇప్పుడిప్పుడే తిరిగి వస్తున్నారు. ఇక్కడ పని చేసే ప్రతి నిమిషం దేవుణ్ణి సాతాను నవ్వులకు ఆస్పదముగా చేసుకున్నాడు. పాపం అనేది సాతాను వ్యాపారం ఎందుకంటే వాడు దేవుని వెలుగును, అందమును, స్వచ్ఛతను మరియు మహిమను ద్వేషిస్తాడు. జీవులు తమ సృష్టికర్తపై అపనమ్మకం మరియు అవిధేయత చూపడం కంటే వాడికి మరేదీ సంతోషం కలిగించదు. కాబట్టి, క్రిస్మస్ మానవులకు శుభవార్త మరియు దేవునికి శుభవార్త. “పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది.” (1 తిమోతి 1:15). అది […] - [క్రిస్మస్ స్వేచ్ఛ కోసమే!](https://samskarana.co.in/christmas-if-for-freedom/): “కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను”. (హెబ్రీయులు 2:14-15) యేసు మనిషిగా మారాడు, ఎందుకంటే ఒక మనిషి మరణం అవసరం అయింది, కానీ ఆ మనిషి సాధారణ మనిషి కంటే ఎక్కువై వుండాలి. దేవుడు తనను తాను మరణశిక్షలో బంధించుకోవడమే శరీర అవతారం. క్రీస్తు, మరణాన్ని ముప్పుగా స్వీకరించలేదు. ఆయన మరణాన్ని ఎంచుకున్నాడు. ఆయన దానిని ఆహ్వానించాడు. అందుకే ఆయన వచ్చాడు: “మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.” (మార్కు 10:45). అరణ్యంలో (మత్తయి 4:1-11) మరియు పేతురు నోటి ద్వారా (మత్తయి 16:21-23) – సాతాను క్రీస్తును ఆ సిలువకు చేరకుండా ఆపడానికి ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు! సిలువ సాతాను […] - [మిషన్స్​‍కు క్రిస్మస్ మాదిరి](https://samskarana.co.in/christmas-is-an-example-for-missions/): “నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని”. (యోహాను 17:18) క్రిస్మస్ మిషన్స్​‍కు ఒక నమూనా. మిషన్స్ క్రిస్మస్ యొక్క అద్దం. నేను, నాలాగే మీరు. ఉదాహరణకు, ప్రమాదం. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కాబట్టి మీకు కూడా. వారు ఆయనపై కుట్ర పన్నారు. కాబట్టి మీకు కూడా. ఆయనకి శాశ్వత ఇల్లు లేదు. కాబట్టి మిమ్మల్ని కూడా. వారు ఆయనపై తప్పుడు కేసులు పెట్టారు. కాబట్టి మీపై కూడా. వారు ఆయనను కొరడాతో కొట్టారు మరియు వెక్కిరించారు. కాబట్టి మిమ్మల్ని కూడా. మూడు సంవత్సరాల పరిచర్య తర్వాత ఆయన మరణించాడు. కాబట్టి మీరు కూడా. కానీ యేసు తప్పించుకున్న వాటికన్నా ఘోరమైన ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కూడా!! 16వ శతాబ్దం మధ్యకాలంలో ఫ్రాన్సిస్ జేవియర్ (1506–1552) అనే మిషనరీ, మలక్కాలో (నేటి మలేషియాలో భాగం) ఫాదర్ పెరెజ్‌కు చైనాకు […] - [ఊహించదగిన గంభీరమైన రక్షణ](https://samskarana.co.in/an-expected-reverential-salvation/): “ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు”. (యిర్మీయా 31:31) దేవుడు నీతిమంతుడు, పవిత్రుడు మరియు మనలాంటి పాపులకి వేరుగా ఉన్నవాడు. క్రిస్మస్ మరియు ప్రతి ఇతర సీజన్‌లో ఇది మన ప్రధాన సమస్య. న్యాయమైన మరియు పవిత్రమైన దేవునితో మనం ఎలా సమాధానపడగలము? అయినప్పటికీ, దేవుడు దయగలవాడు. యిర్మీయా 31లో (క్రీస్తుకు ఐదు వందల సంవత్సరాల ముందు) ఏదో ఒక రోజు ఆయన కొత్తగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఛాయలను మెస్సీయ అనే వాస్తవంతో భర్తీ చేస్తాడు. మరియు ఆయన శక్తివంతంగా మన జీవితాల్లోకి ప్రవేశించి, మన హృదయాలపై తన చిత్తాన్ని వ్రాస్తాడు, తద్వారా మనం బయటి నుండి నిర్బంధించబడకుండా, లోపల నుండి ఆయనను ప్రేమించటానికి మరియు ఆయనను విశ్వసించి అనుసరించడానికి ఇష్టపడతాము.  అది ఊహించదగిన గొప్ప రక్షణ – దేవుడు విశ్వంలో ఉన్న అత్యున్నత వాస్తవాన్ని మనకు అనుభవించేందుకు […] - [దేవుని అత్యంత విజయవంతమైన వెనుకడుగు](https://samskarana.co.in/gods-most-successful-retreat/): “అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను”. (ఫిలిప్పీయులు 2:9–11) క్రిస్మస్ దేవుని అత్యంత విజయవంతమైన వెనుకడుగు ప్రారంభమైన రోజు. ఆయన ఎప్పుడూ తన శక్తిని పరాజయాలుగా కనపడే వాటి ద్వారా చూపించడంలో ఆనందిస్తాడు. ఆయన వ్యూహాత్మక విజయాలను సాధించడానికి కొన్నిసార్లు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతారు. పాత నిబంధనలో, యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులలో ఒకరైన యోసేపు తన కలలో కీర్తి మరియు శక్తి వాగ్దానం చేయబడ్డాడు (ఆదికాండము 37:5-11). కానీ ఆ విజయం సాధించాలంటే అతడు ఈజిప్టులో బానిసగా మారాల్సి వచ్చింది. మరియు, అది సరిపోదన్నట్లుగా, అతని చిత్తశుద్ధి కారణంగా అతని పరిస్థితులు మెరుగుపడినప్పుడు, అతను బానిస కంటే అధ్వాన్నంగా తయారయ్యాడు: ఖైదీ. […] - [క్రిస్మస్‌లో జీవం మరియు మరణం](https://samskarana.co.in/life-and-death-at-christmas/): “దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”. (యోహాను 10:10) నేను దీనిని వ్రాయడం ప్రారంభించబోతున్నప్పుడు, మారియన్ న్యూస్ట్రమ్ మరణించినట్లు వార్త వచ్చింది. మా సంఘంలో ఎక్కువమంది సభ్యులు జన్మించకముందే, మారియన్ మరియు ఆమె భర్త ఎల్మెర్ చాలా కాలంగా సంఘంలో భాగస్వాములుగా ఉన్నారు. ఆమె వయస్సు 87. వారికి వివాహమై 64 సంవత్సరాలు. నేను ఎల్మెర్‌తో మాట్లాడి, అతడు ప్రభువులో బలంగా ఉండాలని మరియు జీవితంపై ఆశను కోల్పోవద్దని చెప్పినప్పుడు, “ఆయన నిజమైన స్నేహితుడు” అని క్రీస్తు గురించి చెప్పాడు. “క్రీస్తు నా నిజమైన స్నేహితుడు” అని క్రైస్తవులందరూ చెప్పగలిగే వారుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి క్రిస్మస్ కి నేను నా తల్లి మరణించిన వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుంటాను. ఇశ్రాయేలులో జరిగిన బస్సు ప్రమాదంలో ఆమె తన 56వ […] - [ఆయన ప్రజల కోసం దానిని నిజం చేయడం](https://samskarana.co.in/making-it-real-for-his-people/): “ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు”. (హెబ్రీయులు 8:6) హెబ్రీయులు 8:6 ప్రకారం క్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి, అయితే దాని అర్ధం ఏమిటి? ఆయన రక్తము – నిబంధన రక్తము (లూకా 22:20; హెబ్రీయులు 13:20) – తుదకు మరియు నిశ్చయముగా దేవుని వాగ్దానాల నెరవేర్పును కొని మన కొరకు భద్రపరుస్తుందని అర్థం. దేవుడు, కొత్త నిబంధన వాగ్దానాల ప్రకారం, క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా మన అంతరంగంలో పరివర్తనను తీసుకువస్తాడని అర్థం. దేవుడు క్రీస్తులో మన పక్షాన ఉన్నాడనే విశ్వాసం ద్వారా మనలో ఈ పరివర్తనను తెస్తాడు అని దీని అర్థం.  కొత్త నిబంధన క్రీస్తు రక్తం ద్వారా కొనుగోలు చేయబడింది, క్రీస్తు ఆత్మ ద్వారా అమలు చేయబడుతుంది మరియు క్రీస్తుపై విశ్వాసం ద్వారా పొందబడింది. క్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తిగా పనిచేయడాన్ని హెబ్రీ […] - [అంతిమ వాస్తవం ఇక్కడే ఉంది](https://samskarana.co.in/the-ultimate-truth-is-here/): “మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా. మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.. . . . మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు”. (హెబ్రీయులు 8:1–2, 5) మనము ఇంతకు ముందు చూశాము. కానీ ఇంకా ఉంది. క్రిస్మస్ అంటే ఛాయలను నిజమైన వాటితో భర్తీ చేయడం. హెబ్రీ 8:1–2, 5 ఒక సారాంశం. విషయమేమిటంటే, మనకు మరియు దేవునికి మధ్యవర్తిగా ఉండి మనలను దేవునితో సరిచేసి, మన కోసం దేవునికి ప్రార్థించే ఈ యాజకుడు పాత నిబంధన రోజుల వలె సాధారణ, బలహీనమైన, పాపాత్మకమైన, మరణించే యాజకుడు కాదు. ఆయన బలమైన, పాపరహితమైన, నాశనంలేని […] - [ఛాయలకు బదులుగా వాస్తవం](https://samskarana.co.in/reality-instead-of-shadows/): “మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా. మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను”. (హెబ్రీయులు 8:1-2) హెబ్రీ గ్రంధం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూసంబంధమైన యాజక పరిచర్య వ్యవస్థకు సరిపోయే ఒక ఉత్తమమైన మరియు చివరి మానవ యాజకుడుగా మాత్రమే ఉండాలని రాలేదు కానీ ఆయన ఆ వ్యవస్థను నెరవేర్చడానికి, అంతం చేయడానికి మరియు మొదట కల్వరిలో మన ఆఖరి బలిగా ఆపై పరలోకంలో మన చివరి యాజకునిగా పరిచర్య చేస్తున్న క్రీస్తుపై మన దృష్టి అంతా మళ్లించడం కొరకు వచ్చాడు. పాత నిబంధన గుడారం, యాజకులు మరియు అర్పణలు రాబోవు వాటి ఛాయలు. ఇప్పుడు నిజమైనవి వచ్చాయి కాబట్టి నీడలు అంతమయిపోయాయి. పిల్లల కోసం మరియు ఒకప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవారు మరియు అప్పటి విషయాలు గుర్తుంచుకున్న వారికొరకు […] - [యేసు ఎందుకు వచ్చాడు?](https://samskarana.co.in/why-did-jesus-came/): “కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను”. (హెబ్రీయులు 2:14-15) ఇది నాకు ఇష్టమైన క్రిస్మస్ ను గురించిన వాక్య భాగం, ఎందుకంటే యేసు భూమి మీద ఆయన జీవిత ప్రారంభం మరియు ముగింపు, శరీరధారిగా అవతరించడానికి మరియు సిలువకు మధ్య ఉన్న సంబంధాన్ని అంత స్పష్టంగా చూపించే వాక్య భాగం మరొకటి లేదు. యేసు మరణించడానికి వచ్చాడని ఈ రెండు వచనాలు స్పష్టం చేస్తున్నాయి; మీ అవిశ్వాస స్నేహితునికి లేదా కుటుంబ సభ్యులకి క్రైస్తవ కోణంలో  క్రిస్మస్ గురించి వివరించడానికి ఈ వాక్య భాగం చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక్కొక్క మాటను తీసుకొని వివరించవచ్చు: “కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. . . ” “పిల్లలు” అనే పదం పై వాక్యం నుండి తీసుకోబడింది […] - [బంగారం, సాంబ్రాణి, మరియు బోళం](https://samskarana.co.in/gold-sambrani-and-bolam/): “వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి”. (మత్తయి 2:10-11) దేవునికి ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. (అపొస్తలుల కార్యములు 17:25). సహాయం కోసమో లేదా అవసరాన్ని తీర్చడం కోసమో జ్ఞానులు ఆ బహుమతులు ఇవ్వలేదు. విదేశీ సందర్శకులు రాజసత్కార ప్యాకేజీలు తీసుకువస్తే, అది ఒక రాజును అవమానపరచినట్లే అవుతుంది. అలాగే ఈ బహుమతులు లంచాలు కావు. దేవుడు లంచం తీసుకోడు అని ద్వితియోపదేశకాండము 10:17 చెబుతోంది. అప్పుడు వారు ఇచ్చిన బహుమతుల అర్థం ఏమిటి? అవి ఎలా ఆరాధనగా భావించబడతాయి? ధనవంతులుకు, స్వయం సమృద్ధిగల వ్యక్తులకు ఇచ్చే బహుమతులు ఆ వ్యక్తి ఎంత అద్భుతమైనవాడో చూపించాలనే దాత యొక్క కోరికను ప్రతిధ్వనింప చేయడానికి, తీవ్రతరం చేయడానికి ఉపయోగపడతాయి. ఒక కోణంలో, క్రీస్తుకు […] - [యేసయ్యకు రెండు రకాల వ్యతిరేకతలు](https://samskarana.co.in/there-are-two-types-of-opposition-to-isaiah/): “హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి”. (మత్తయి 2:3) తనను ఆరాధించకూడదనుకునే వ్యక్తులకు యేసు ఇబ్బందిగా మారాడు, అలాంటి వారిపై వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది బహుశా మత్తయి యొక్క మనస్సులో ఉన్న ఒక ప్రధాన అంశం కాదుగాని కథ కొనసాగుతున్నప్పుడు దాని నుండి ఈ గూడ అర్ధమును మనం గ్రహించవచ్చు. ఈ కథలో, యేసును ఆరాధించకూడదనుకునే రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. మొదటి రకం యేసును అస్సలు పట్టించుకోని వ్యక్తులు. వారి జీవితాల్లో ఆయన ఒక సున్నా. యేసు ఉన్న దినాలలో ఈ గుంపుకి ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మత్తయి 2:4 ఇలా చెబుతోంది, “కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.” కాబట్టి వారు హేరోదు ప్రశ్నకు జవాబిచ్చి యధావిధిగా ఎవరి పని వారు చేసుకోడానికి తిరిగి వెళ్లిపోయారు. జరుగబోతున్న […] - [బెత్లెహేములో అసాధారణ నక్షత్రం](https://samskarana.co.in/unusual-star-in-bethlahem/): “యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి”. (మత్తయి 2:2) కొన్ని విషయాలు ఎలా జరిగాయనే దానిపై మన కుతూహలమును బైబిలు పదే పదే ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  తూర్పు దేశపు జ్ఞానులను ఈ “నక్షత్రం” తూర్పు నుండి యెరూషలేముకు ఎలా తీసుకొని వచ్చింది? అది వారిని నడిపించిందని లేదా యెరూషలేముకు వెళ్లే మార్గంలో వారికి ముందుగా వెళ్లిందని చెప్పలేదు. వారు తూర్పున ఒక నక్షత్రాన్ని చూశారని మాత్రమే చెబుతుంది (మత్తయి 2:2) మరియు యెరూసలేంకు వచ్చారు. మరియు మత్తయి 2:9 చెప్పినట్లుగా యెరూసలేం నుండి బెత్లెహేముకు ఐదు మైళ్ల నడకలో ఆ నక్షత్రం వారి ముందు ఎలా వెళ్ళింది? మరియు ఒక నక్షత్రం ఎలా “ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచింది”? సమాధానం: మనకు తెలియదు. గ్రహాలు లేదా తోకచుక్కలు లేదా సూపర్నోవాలు లేదా అద్భుత లైట్ల కలయికల పరంగా […] - [తూర్పు దేశపు జ్ఞానుల కోసం మెస్సీయ](https://samskarana.co.in/messaiah/):  “రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి”. (మత్తయి 2:1–2) లూకా సువార్తలో చెప్పినట్లుగా, గొర్రెల కాపరులు శాలలో యేసును సందర్శించడానికి వస్తున్నారని మత్తయి మనకు చెప్పలేదు. యేసును ఆరాధించడానికి తూర్పు నుండి వస్తున్న విదేశీయులపై అనగా – యూదులు కాని అన్యులపై అతని దృష్టి ఉంది. కాబట్టి, మత్తయి తన సువార్త ప్రారంభంలో, ముగింపులో యేసును యూదులకే కాకుండా అన్ని దేశాలకు సార్వత్రిక మెస్సీయాగా చూపించాడు. ఇక్కడ మొదటి ఆరాధకులు ఆస్థాన మాంత్రికులు, లేదా జ్యోతిష్కులు లేదా జ్ఞానులు ఇశ్రాయేలు నుండి కాదు కానీ తూర్పు నుండి వచ్చారు – బహుశా బబులోను నుండి వచ్చిన వారు. వారు అన్యులు. పాత నిబంధన ప్రకారం అపవిత్రులు. మత్తయి చివరిలో, యేసు యొక్క […] - [ఆయన కిష్టులైన మనుష్యులకు సమాధానం](https://samskarana.co.in/he-is-the-answer-to-the-people-he-likes/): “దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను”. (లూకా 2:12–14) ఎవరికి సమాధానం? దేవదూతల స్తుతిలో అంధకారముతో కూడిన ఒక మాట ఉంది. ఆయన అనుగ్రహం ఉన్నవారికి  సమాధానం. ఆయన కిష్టులైన వారికి సమాధానం. కానీ విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం (హెబ్రీ 11:6). కాబట్టి, క్రిస్మస్ అందరికీ సమాధానమును కలిగించదు. “ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.” (యోహాను 3:19) అని యేసు చెప్పాడు. లేదా వృద్ధుడైన సుమెయోను యేసును చూసినప్పుడు ఇలా అన్నాడు, “ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు […] - [కల్వరి నుండి పక్కదారి లేదు](https://samskarana.co.in/there-is-no-detour-from-calvary/): “వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను”. (లూకా 2:6–7) మరియ యోసేపులను బెత్లెహేముకు తీసుకురావడానికి ప్రపంచ జనాభా సేకరణను ఉపయోగించేలా దేవుడు ప్రపంచాన్ని పరిపాలిస్తే, ఆయన ఖచ్చితంగా సత్రంలో ఒక గది అందుబాటులో ఉండేలా చూడగలడని మీరు అనుకుంటారు. అవును, ఆయన అలా చేయగలడు. ఆయన ఖచ్చితంగా అలా చేయగలడు! మరియు యేసు ఒక సంపన్న కుటుంబంలో జన్మించి ఉండవచ్చు. ఆయన అరణ్యంలో రాయిని రొట్టెగా మార్చగలడు. ఆయన గెత్సమనేలో తన సహాయానికి 10,000 మంది దేవదూతలను పిలిచి ఉండవచ్చు. ఆయన సిలువ నుండి దిగి తనను తాను రక్షించుకొని ఉండవచ్చు. దేవుడు ఏమి చేయగలడు అనేది కాదు, కానీ ఆయన ఏమి చేయాలనుకున్నాడు అనేదే ప్రశ్న. దేవుని చిత్తం ఏమిటంటే, క్రీస్తు ధనవంతుడు అయినప్పటికీ, మీ కొరకు ఆయన […] - [దేవుని దీన ప్రజల కోసం](https://samskarana.co.in/for-the-humble-people-of-god/): “ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియ దేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను”. (లూకా 2:1–5) మెస్సీయ బెత్లెహేములో జన్మించాలని దేవుడు ముందుగా నిర్ణయించడం ఎంత అద్భుతమైన విషయమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా (మీకా 5:2లోని ప్రవచనం చెప్తున్నట్లుగా); సమయం వచ్చినప్పుడు, మెస్సీయ తల్లి మరియు చట్టబద్ధమైన తండ్రి బెత్లెహేములో కాకుండా నజరేతులో నివసించేలా దేవుడు ఏర్పాటు చేశాడు; దేవుడు తన మాటను నెరవేర్చడానికి మొదటి క్రిస్మస్ సందర్భంగా అనామకులైన, సామాన్యులైన, అల్పులైన ఇద్దరిని బెత్లెహేముకు తీసుకురావడానికి, రోమా సామ్రాజ్యములోని ఒక్కొక్కరిని తన సొంత పట్టణంలో […] - [దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న దేవుని దర్శనం](https://samskarana.co.in/a-long-awaited-vision-of-god/): “ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును, అనగా మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను”. (లూకా 1:68–71) ఎలీసబెతు భర్త జెకర్యా చెప్పిన ఈ మాటల్లోని రెండు విశేషమైన విషయాలను లూకా 1లో గమనించండి. మొదటిది, తొమ్మిది నెలల ముందు, జెకర్యా తన భార్యకు సంతానం కలుగుతుందని నమ్మలేకపోయాడు. ఇప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడై, రాబోయే మెస్సీయలో దేవుడు చేయబోయే విమోచన కార్యంపై చాలా నమ్మకం గలవాడై దానిని జరిగిపోయినట్లుగా పేర్కొన్నాడు: “ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను.” విశ్వసించిన వారి మనస్సులో, దేవుని వాగ్దానాలు జరిగిపోయినట్లే. జెకర్యా దేవుని మాటను అంగీకరించడం నేర్చుకున్నాడు మరియు ఒక అద్భుతమైన నిశ్చయత కలిగి ఉన్నాడు: దేవుడు “తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను” (లూకా 1:68). రెండవది, […] - [మరియ యొక్క అద్భుతమైన దేవుడు](https://samskarana.co.in/marys-wonderful-god/): “అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను”. (లూకా 1:46–55) దేవుని గురించిన ఒక విశేషమైన విషయాన్ని మరియ స్పష్టంగా చూస్తుంది: ఆయన మానవ చరిత్ర దిశను పూర్తిగా మార్చబోతున్నాడు; కాలమంతటిలో అత్యంత ముఖ్యమైన మూడు దశాబ్దాలు ప్రారంభం […] - [మార్గాన్ని సిద్ధం చేయండి](https://samskarana.co.in/prepare-the-way/): “ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును”. (లూకా 1:16–17) బాప్తిస్మమిచ్చు యోహాను ఇశ్రాయేలు కోసం ఏదైతే చేశాడో, యేసుక్రీస్తు రాక మన కోసం అదే చేయగలదు. క్రిస్మస్ విషయంలో సిద్దపడని వారుగా ఉండొద్దు. నా ఉద్దేశ్యం ఆధ్యాత్మిక సిద్ధపాటు. మీరు సిద్ధంగా ఉంటే దాని ఆనందం మరియు ప్రభావం మీలో చాలా ఎక్కువగా ఉంటుంది! కాబట్టి, మీరు సిద్ధంగా ఉండడానికి. . . మొదట, మనకు రక్షకుడు అవసరమనే వాస్తవాన్ని ధ్యానించండి. క్రిస్మస్ అనేది ఆనందంగా మారడానికి ముందు మన మీద ఒక ఆరోపణ చేస్తుంది. “దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు” (లూకా 2:11). మీకు […] - [అవమానకరమైన సిలువలో విజయం](https://samskarana.co.in/victory-in-the-crucifixion-of-humiliation/): “అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన [క్రీస్తు] అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లయినయెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచబడెను”. (హెబ్రీ 9:25-26) అలాగని పరలోకంలో పాపులకు స్వాగతం పలుకుతారని మనం ఆయన బలిని తేలిగ్గా తీసుకోకూడదు. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిపూర్ణ న్యాయవంతుడు, నీతిమంతుడు. అయినా అంతటి గొప్ప, పరిశుద్ధుడైన దేవుడు నీలాంటి, నాలాంటి అపవిత్రమైన వ్యక్తులను తన దయకు పాత్రులనుగా ఎలా స్వాగతిస్తాడన్నదే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొత్తం కథ. ఇదెలా సాధ్యపడుతుంది? పాపం కోసం క్రీస్తు బలి అనేది యూదుల ప్రధాన యాజకులు బలులిచ్చినట్లుగా లేదని హెబ్రీ 9:25వ వచనం చెబుతోంది. ప్రజల పాపముల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రాణులను బలులివ్వడంతో వారు సంవత్సరానికి ఒకమారు అతి పరిశుద్ధ […] - [మనస్సాక్షిని శుద్ధి చేసే ఏకైక విషయం](https://samskarana.co.in/the-only-thing-that-purify-the-conscience/): “నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును”. (హెబ్రీ 9:14) ఇక్కడ మనం ఆధునిక యుగంలో ఉన్నాం, అంటే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు ఉన్నటువంటి, అంతరిక్ష ప్రయాణాలు చేస్తున్నటువంటి మరియు గుండె మార్పిడిలు జరుగుతున్నటువంటి యుగంలో ఉన్నాం. మన సమస్య ప్రాథమికంగా ఎప్పటిలాగే ఉంది, అదేంటంటే మన మనస్సాక్షి మనల్ని ఖండిస్తోంది మరియు మనం దేవునికి ఆమోదయోగ్యం కాదని భావించేలా చేస్తోంది. మనం దేవునికి దూరమయ్యాం. మన మనస్సాక్షి సాక్ష్యమిస్తోంది. మన పిల్లలను పవిత్ర నదిలోకి విసిరేయడ౦, కోట్లాది రూపాయలను విరాళ౦గా ఇవ్వడ౦, లేదా ఆశ్రమాలలో సేవ చేయడ౦ ద్వారా మన౦ ప్రాయశ్చిత్త౦ చేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్ని౦చవచ్చు కానీ ఇవేవీ ఆ మరకను తొలగించలేవు లేదా మరణ భయాన్ని తగ్గించలేవు. మన మనస్సాక్షి అపవిత్రమైందని మనకు తెలుసు, అంటే శవాన్ని, […] - [కృతజ్ఞత లేకపోవడానికి మూలం](https://samskarana.co.in/reason-for-not-showing-gratitude/): “వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి”. (రోమా 1:21) దేవునిపట్ల మానవ హృదయంలో కృతజ్ఞత పెల్లుబికినప్పుడు మన ఆశీర్వాదపు సంపదకు ఆధారంగా ఆయన ఘనపరచబడతాడు. ఆయన ఇచ్చేవాడిగాను, ఉపకారిగాను మహిమపొందుతాడు. అయితే, మనపట్ల దేవుడు చూపిన మంచితనం కోసం మన హృదయాలలో కృతజ్ఞత లేదంటే, దాని అర్థం బహుశా మనం ఆయనకు స్తుతి ప్రశంశలు చెల్లించడానికి ఇష్టపడటంలేదని అర్థం; ఆయనను మన ఉపకారిగా ఘనపరచడానికి మనకి ఇష్టంలేదని అర్థం. స్వభావరీత్యా మానవులు దేవునిని కృతజ్ఞతతో ఘనపరచకపోవడానికి, లేదా తమ ఉపకారిగా ఆయనను కీర్తించకపోవడానికి చాలా మంచి కారణం ఉంది. అలా చేయకపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ఘనపరిచి, కీర్తించినప్పుడు మనకు రావలసిన మహిమను కోల్పోతాం మరియు స్వభావ సిద్ధంగా ప్రజలందరూ దేవుని మహిమకంటే ఎక్కువగా తమ స్వంత మహిమను ప్రేమిస్తారు. కృతజ్ఞత లేకపోవడానికి మూలం ఏంటంటే ఒక వ్యక్తి తన […] - [దేవుణ్ణి ఎలా ఘనపరచాలి?](https://samskarana.co.in/how-to-glorify-god/): “కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను”. (కీర్తన 69:30) పెద్దవిగా చేసి చూడటంలో రెండు విధాలున్నాయి, వాటిలో ఒకటి, మైక్రోస్కోపులో చూడటం, రెండవది టెలిస్కోపులో చూడటం. అందులో మొదటిది చిన్నవాటిని పెద్దవిగా చూడటం, అంటే అవి కలిగియున్న దానికంటే పెద్దవిగా చూడటం. రెండవదేమో, పెద్దవైన వాటిని అనగా అవి వాస్తవానికి ఎంత పెద్దవో అంతే పరిమాణంలో కనబడేలా చూడటం. “కృతజ్ఞతా స్తుతులతో నేనాయనను ఘనపరచెదను” అని దావీదు చెప్పినప్పుడు, “చిన్న దేవుణ్ణి ఆయన ఉండేదానికంటే పెద్దవాడిగా చూపిస్తాను” అని చెప్పడం లేదు గాని “దేవుడు ఎంత పెద్దవాడిగా ఉన్నాడో అంతే పెద్ద వాడిగా ఆయనను చూపిస్తాను” అని ఆయన చెప్తున్నాడు. మనం మైక్రోస్కోపులుగా (సూక్ష్మదర్శినిలుగా) పిలువబడలేదు గాని మనం టెలిస్కోపులుగా (దూరదర్శినిలుగా) పిలువబడ్డాం. మంచి వస్తువుకు పోటీగా తక్కువ క్వాలిటి ఉన్నటువంటి వస్తువును అమ్మేవారిలాగ క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ఎక్కువ చేసి చెప్పకూడదు, లేదా తప్పుగా అభివర్ణించకూడదు. […] - [మన కోసం యేసు ప్రార్థిస్తున్నాడు](https://samskarana.co.in/jesus-is-praying-for-us/): “ఈయన తన ద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు”. (హెబ్రీ 7:25) మన కోసం విజ్ఞాపన చేయడానికి క్రీస్తు ఎల్లప్పుడు జీవిస్తున్నాడు కాబట్టి సంపూర్ణంగా, శాశ్వతంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మరొక విధంగా చెప్పాలంటే, క్రీస్తు నిరంతరం మన కోసం విజ్ఞాపన చేయకపోతే ఆయన మనల్ని శాశ్వతంగా రక్షించలేడని పై వచనం చెప్తోందన్నమాట. ఈ మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు యాజకత్వం ఉన్నంత కాలం మన రక్షణకు భద్రత ఉంటుంది. ఇందుచేతనే, మనకు మానవ యాజకునికంటే ఎంతో గొప్పవాడైన యాజకుడు అవసరం. క్రీస్తు దైవత్వం మరియు మృతులలో నుండి ఆయన పునరుత్థానం అనేవి మన కోసం నశించని ఆయన యాజకత్వాన్ని భద్రపరుస్తాయి. దీని అర్థం మన రక్షణ గురించి మనం తరచుగా మాట్లాడుకునే తేలికపాటి మాటలలో మాట్లాడుకోకూడదు, అంటే నేను ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాను, క్రీస్తు మరణించి […] - [కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచండి](https://samskarana.co.in/glorify-god-by-giving-thanks/): “కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి”. (2 కొరింథీ 4:13)  దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఆనందంతో కూడిన భావోద్వేగం. ఆయన కృప కోసం మనం ఎంతో ఆనందంతో కూడిన ఋణ భావాన్ని కలిగియున్నాం. కాబట్టి, కృతజ్ఞతలు చెల్లించే ప్రతి భావంలోనూ, మనమందరం ప్రయోజనాలను పొందుతూనే ఉన్నాం. అయితే, స్వభావరీత్యా, కృతజ్ఞతలు చెల్లించడమనేది ఇచ్చిన వ్యక్తిని మహిమపరుస్తుంది. మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నప్పుడు, మనం మన అవసరతను, దేవుని ఉపకారాన్ని, దేవుని సంపూర్ణతను, ఆయన మహిమైశ్వర్యమును గుర్తిస్తాం. నన్ను నేను తగ్గించుకొని, రెస్టారెంట్ లోని సర్వర్ కి “థాంక్యూ” అని చెప్పి, అతను అందించిన సేవకు అతణ్ణి పొగిడాను, అలాగే నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పాలని కృతజ్ఞతా భావంతో నిండియున్నప్పుడు నన్ను నేను తగ్గించుకొని, నేను ఆయనను ఘనపరుస్తాను. అవును, ఇక్కడున్న వ్యత్యాసం ఏంటంటే దేవుడు నాకు చూపించే కృప […] - [మీ నిరీక్షణను గట్టిగా పట్టుకోండి](https://samskarana.co.in/hold-fast-your-hope/): “ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను”. (హెబ్రీ 6:17-18) మన నిరీక్షణను గట్టిగా చేపట్టాలని హెబ్రీ గ్రంథకర్త మనల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? మన నిరీక్షణకుగల అంతిమ ఆనందం యేసు రక్తం ద్వారా పొంది, మార్చలేని విధంగా భద్రపరచబడి ఉన్నట్లయితే, గట్టిగా పట్టుకోవాలని దేవుడు మనకెందుకు చెప్తున్నాడు? ఈ ప్రశ్నకు జవాబు ఇక్కడుంది: ఆయన చనిపోయాడు కాబట్టి, “ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేనినిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను” అని ఫిలిప్పీ 3:12లో పౌలు చెప్పినట్లుగా మీరు చేయవలసి ఉంది. ఇది మూర్ఖత్వం కాదు గాని ఒక పాపి దేవునిలో నిరీక్షణ […] - [తనతోడు అని దేవుడే ప్రమాణం చేస్తే…](https://samskarana.co.in/if-god-swears-by-himself/): “దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక తనతోడు అని ప్రమాణము చేసి – నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను”. (హెబ్రీ 6:13-14) విలువ, గౌరవం, హుందాతనం, గొప్పతనం, అందం, కీర్తిలాంటి ఇతర విలువలకంటే పదివేల రెట్లు ఎక్కువ విలువలు కలిగియున్న ఒకే ఒక్క వ్యక్తి దేవుడే. కాబట్టి, దేవుడు ప్రమాణం చేసినప్పుడు, తనతోడు అని ప్రమాణం చేశాడు. ఆయన ఇంకా పైకి వెళ్లగలిగితే మరింత ఎత్తుకు వెళ్లేవాడు. ఎందుకు? మీరు కలిగియున్న నిరీక్షణలో బలమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి. దేవుడు తనతోడు అని ప్రమాణం చేసినప్పుడు, ఆయన తనను తాను ఎన్నడు అలక్ష్యం చేసుకోడు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం ఎన్నటికి నిరర్థకం చేయబడదని దేవుడు చెబుతున్నాడు. ఆయన మనకు మరి ఎక్కువ భరోసా ఇవ్వలానుకుంటే దానిని ఖచ్చితంగా ఇచ్చేవాడే. ఎందుకు? మీ నిరీక్షణ […] - [ఆధ్యాత్మిక పరిపక్వతకు కీలకమైన అంశం](https://samskarana.co.in/a-key-key-to-spiritual-maturity/): “వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును”. (హెబ్రీ 5:14) ఇప్పుడు ఇది అద్భుతమైన విషయం. దీన్ని వదులుకోకండి. ఇది బహుశా సంవత్సరాల తరబడి వృధా చేసుకున్న జీవితాన్ని రక్షించవచ్చు. ఈ వచనం ఏమి చెబుతోందంటే, దేవుని మాటల యొక్క మరింత దృఢమైన బోధలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి మరియు మీరు పరిపక్వత చెందడానికి, దేవుని సువార్త వాగ్దానాల యొక్క శ్రేష్టమైన, పుష్టిగా ఉన్న పోషకాంశములు కలిగిన పాలు మీ నైతిక ఇంద్రియాలను, అంటే మీ ఆధ్యాత్మిక మనస్సును రూపాంతరం చేస్తుంది. తద్వారా మీరు మంచి మరియు చెడుల మధ్య ఉండే వ్యత్యాసాన్ని వివేచించగలరు. ఈ విషయాన్ని మరో విధంగా చెబుతాను వినండి. దేవుని వాక్యపు విందుకు సిద్ధపడడ౦ అనేది మొదటిగా మేధోపరమైన సవాలు కాదు; ఇది మొదటిగా నైతికపరమైన సవాలు. మీరు దేవుని వాక్యమనే బలమైన ఆహారాన్ని తినాలనుకుంటే, […] - [కృతజ్ఞత యొక్క ఆకర్షణ శక్తి](https://samskarana.co.in/gratitude-is-the-power-of-attraction/): “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు”… (2 తిమోతి 3:1-2) కృతజ్ఞత లేకపోవడం అనేది అహంకారం, దూషణ, అవిధేయతలతో కలిసి ఎలా వెళ్తోందో గమనించండి.   వేరొక చోట, “కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు” (ఎఫెసీ 5:4) అని పౌలు చెప్తున్నాడు. అందుచేత, కృతజ్ఞత, ఉపకార స్మ్రుతి అనేవి వికృతత్వానికి మరియు హింసకు విరుద్ధమైనవి.  ఇలా ఉండటానికి కారణం ఏంటంటే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడమనేది తగ్గింపుతో కూడిన భావనే గాని గర్వించేది కాదు. ఇది ఇతరుల్ని మెచ్చుకునేదే గాని స్వయాన్ని ఘనపరచుకునేది కాదు. ఇది సంతోషకరమైన హృదయాన్ని కలిగి ఉంటుందే గాని కోపంతోను చేదు భావంతో కూడిన హృదయాన్ని కలిగియుండదు. చేదు భావంతో కూడిన ఉపకార స్మ్రుతి అనేది మాటలలో విభేదిస్తుంది.  కృతజ్ఞతా […] - [చావు లాభమని చెప్పడానికి ఐదు కారణాలు](https://samskarana.co.in/five-reasons-why-death-is-profitable/): “నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము”. (ఫిలిప్పీ 1:21) చావు అనేది “లాభమెలా” అవుతుంది? ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు. మనలో పాపం ఏ మాత్రం ఉండదు. మనల్ని ప్రేమించి, మనకోసం తనను తాను అర్పించిన ప్రభువును బాధపెట్టడం వల్ల కలిగే అంతర్గత యుద్ధం, హృదయ విదారక నిరుత్సాహాలు మనకుండవు.  పునరుత్థాన ఆనందాన్ని మనము అప్పటికి పొందుకోలేము గానీ బాధ నుండి స్వాతంత్యం కలిగించు ఆనందం మనదవుతుంది. మరణంలో జరగబోయేటువంటి సంఘటనను చూపించడానికి లాజరు మరియు ధనవంతుని గురించిన కథను యేసు చెప్తున్నాడు.   అప్పుడతడు [ధనవంతుడు] పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును […] - [మనకందరికి సహాయం అవసరం](https://samskarana.co.in/we-all-need-help/): మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. (హెబ్రీ 4:16) మనలో ప్రతి ఒక్కరికి సహాయం అవసరం. మనము దేవుళ్ళము కాము. మనకు బలహీనతలున్నాయి. మనకు గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. మనకు అన్ని విషయాలలో పరిధిలు ఉన్నాయి. మనకు సహాయం కావాలి.  అయితే, మనలో ప్రతి ఒక్కరం ఎదో ఒకటి కలిగి ఉన్నాం: మనం పాపాలను కలిగి ఉన్నాం. కాబట్టి మనకు అవసరమైన సహాయాన్ని పొందుకోవడానికి మనం అర్హులం కాదని మన హృదయంతరంగంలో మనకు బాగా తెలుసు. అందుచేత, మనం చిక్కుకుపోయినట్లు భావిస్తాం.  నా జీవితాన్ని జీవించడానికి, మరణాన్ని ఎదుర్కోవడానికి, నిత్యత్వ విషయంలో సహకరించడానికి నాకు సహాయం అవసరం, అంటే నా కుటుంబానికి, నా జీవిత భాగస్వామికి, నా పిల్లలకు, నా ఒంటరితనానికి, నా ఉద్యోగానికి, నా ఆరోగ్యానికి, నా ఆర్థిక పరిస్థితులకు సహాయం అవసరం. నాకు సహాయం కావాలి గాని నాకు అవసరమైన సహాయానికి […] - [విభజించగలిగిన దేవుని వాక్యపు శక్తి](https://samskarana.co.in/the-power-of-gods-word/): “ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది”. (హెబ్రీ 4:12) దేవుని వాక్యమే మనకున్న ఏకైక నిరీక్షణ. దేవుని వాగ్దానాలను గురించిన శుభవార్త, ఆయన తీర్పుకు సంబంధించిన హెచ్చరికలు అనేవి నా హృదయపు అడుగు భాగాన్ని విభజించుకుపోవడానికి మరియు పాపపు అబద్ధాలన్నీ నిజమైన అబద్ధాలేనని నాకు చూపించేంత పదునైనవి, సజీవంగా ఉండేవి, విభజించునంతగా చురుకుగా ఉండేవి.  గర్భస్రావం నాకు అద్భుతమైన భవిష్యత్తును సృష్టించదు. మోసం చేయడమో, రెచ్చగొట్టే దుస్తులు ధరించడమో, నా లైంగిక పవిత్రతను జారవిడుచుకోవడమో, పనిలో నిజాయితీ లేకపోవడమో, విడాకులు తీసుకోవడమో, ప్రతీకారం తీర్చుకోవడమో అనేవి అద్భుతమైన ప్రజ్వల భవిషత్తును సృష్టించి ఇవ్వవు. ఈ మోసము నుండి నన్ను రక్షించేది దేవుని వాక్యమే.  దేవుని వాగ్దానం యొక్క వాక్యం మన హృదయాలలో సంతృప్తికరమైన ఆనందాల ముసుగులో ఉన్న పాపపు పురుగులపై ప్రకాశవంతమైన […] - [మార్పు సాధ్యమే](https://samskarana.co.in/change-is-possible/): “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను”. (ఎఫెసీ 4:24) క్రైస్తవ్యం అంటేనే మార్పు సాధ్యమని అర్థం. లోతైన, మౌలికమైన మార్పు సాధ్యం. మీరు మొద్దుబారిపోయి, బండబారిపోయిప్పుడు మీ హృదయం సున్నితంగా మారడానికి సాధ్యమవుతుంది. కక్ష, కోపం అనేవాటి ద్వారా దాడి చేయబడకుండ ఆపడం కూడా సాధ్యమే. మీ నేపథ్యం ఏదైనప్పటికీ, ప్రేమగల వ్యక్తిగా మారడమనేది కూడా సాధ్యమే. మన౦ ఎలా ఉ౦డాలి అనే దానిలో దేవుడే నిర్ణయాన్ని తీసుకుంటాడని బైబిలు భావిస్తో౦ది. నిర్మొహమాట౦ లేకుండా ఎంతో అద్భుతంగా, “సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. కరుణాహృదయులై..” (ఎఫెసీ 4:31-32) ఉండాలని బైబిల్ చెబుతోంది. “వీలైతే. . . ” లేదా, “మీ తల్లిదండ్రులు కరుణాహృదయులైతే… ” లేదా, “మీరు తీవ్రంగా దూషించబడకపోతే … ” అని బైబిల్ చెప్పట్లేదు గాని “మీరు కరుణాహృదయులై ఉండండి” అని బైబిల్ బోధిస్తోంది.  ఇది ఎంతో అద్భుతమైన స్వేచ్చ. నాకు మార్పు […] - [నేను చింతిస్తున్నప్పుడు](https://samskarana.co.in/when-i-worry/): “ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి”. (1 పేతురు 5:7) మీరు శోధించబడి పాపం చేయాలనుకున్న ప్రతి పాపానికి, భద్రతను తొలగించి మిమ్మల్ని చింతాక్రాంతులుగా చేసే ప్రతి విధమైన అపనమ్మకానికి సరిపోయే ఒక వాగ్దానం ఉంటుంది. ఉదాహరణకు: నాకున్న అనారోగ్యం గురించి నేను చింతిస్తున్నప్పుడు, “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును” (కీర్తన 34:19) అనే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్ధంగా పోరాడుతాను.  “అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది” (రోమా 5:3-5) అనే వాగ్దానాన్ని నేను వణుకుతూ తీసుకుంటాను. నేను వృద్ధాప్యం గురించి చింతిస్తున్నప్పుడు, “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తలవెండ్రుకలు […] - [పోరాటం చేసే మాటలు](https://samskarana.co.in/fighting-words/): “నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును”. (యెషయా 41:10) ఏదైనా ప్రమాదంతో కూడిన క్రొత్త పని లేక ఒక సమావేశ౦ గురి౦చి నేను చింతిస్తున్నప్పుడు, నేను తరచూ ఉపయోగి౦చే వాగ్దానాల్లో ఒకటైన యెషయా 41:10వ వచనంలో ఉన్న వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్దంగా పోరాడుతాను.  నేను జర్మనీలో మూడేళ్ళు చదువుకోవడానికి వెళ్ళిన రోజు, మా నాన్న చాలా దూరంలో ఉన్న న్యూయార్క్ నుండి పోన్ చేసి, ఫోన్ లోనే ఈ వాగ్దానం నాకు ఇచ్చారు. విపరీతమైన ఒత్తిడిలో ఉన్న నన్ను బయటకు తీసుకు రావడానికి మూడేళ్లుగా నేను వందలసార్లు ఈ వాగ్దానాన్ని అన్వయించుకున్నాను.  నా మనస్సు అనే మోటర్ న్యూట్రల్ గా ఉన్నప్పుడు, గేర్ల శబ్దంగా యెషయా 41:10 నాకు వినిపిస్తూ ఉండేది. నాకు ఈ వచనమంటే చాలా […] - [సృష్టి యొక్క అద్భుతం](https://samskarana.co.in/the-marvel-of-creation/): “అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును. ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజ యైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు”. (1 కొరింథీ 15:35-38) సృష్టిలో దేవుని సన్నిహితమైన జోక్యాన్ని చూపి౦చే లేఖన౦లోని చిన్న చిన్న విషయాలను నేను ఎత్తి చూపుతున్నాను. ఉదాహరణకు, ఇక్కడ 1 కొరి౦థీ 15:38వ వచనంలో ఒక రూప౦లో నాటబడిన విత్తనం, మరొక రూపంలో ఎలాగైతే వస్తుందో అలాగే ఇతర శరీరాలన్ని౦టికన్నా భిన్నమైన “శరీర౦”తో బయటకి వస్తుందని పౌలు పోల్చి చెప్తున్నాడు. “దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. […] - [మీ హృదయాన్ని కఠినపరచుకోకండి](https://samskarana.co.in/do-not-harden-your-heart/): “తన [ఆయన] విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి  ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము”. (హెబ్రీ 3:18-19) ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం రెండు భాగాలుగా విభజించబడడం చూసి, ఆరిన నేల మీద సముద్రం గుండా నడిచినప్పటికీ, వారికి దాహం వేసిన మరుక్షణమే, వారి హృదయాలు దేవునిపట్ల కఠినంగా మారిపోయాయి మరియు దేవుడు తమ్మును జాగ్రత్తగా చూసుకుంటాడని వారు ఆయనను విశ్వసించలేకపోయిరి. ఐగుప్తులోనే జీవితం చాలా బాగుండేదని వారు దేవునికి విరుద్ధంగా సణుగుకున్నారు. ఇలాంటి విషయాన్ని నిరోధించడానికే హెబ్రీయుల పుస్తకం వ్రాయబడింది. క్రైస్తవులుగా పిలవబడుతున్న ఎంతోమంది తమ ప్రయాణాన్ని దేవునితో ప్రారంభిస్తారు. తమ పాపాలు క్షమించబడతాయని, నరకం నుండి తప్పించుకుని పరలోకానికి వెళ్తారని వారు వింటారు. అంతేగాకుండా, “నేను కోల్పోవటానికి ఏమి ఉంది? నేను నమ్ముతాను” అని వారంటారు. అయితే, ఒక వారంలోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో లేదా పది సంవత్సరాలలోనో […] - [సాతాను దేవునికి ఎలా సేవ చేస్తాడు?](https://samskarana.co.in/how-does-satan-serve-god/): “సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు”. (యాకోబు 5:11) రోగాలు మరియు వైకల్యాల వెనుక దేవుని అంతిమ చిత్తం దాగి ఉంటుంది. సాతాను ప్రమేయం లేదని కాదు గాని వాడు ఎల్లప్పుడూ ఏదో ఒక వినాశకర ఉద్దేశాలలో నిమగ్నమై ఉంటాడు (అపొ. కార్య 10:38). అయితే, వాని శక్తి నిర్ణయాత్మకం కాదు. దేవుని అనుమతి లేకుండా వాడు పనిచేయలేడు. యోబు అనారోగ్యానికి ఇదొక కారణం. యోబుకు వ్యాధి వచ్చినప్పుడు, “కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను” (యోబు 2:7) అని వాక్యంలో స్పష్టంగా ఉంది. దేవుణ్ణి దూషించమని  భార్య యోబును బలవంతపెట్టింది. అయితే, “మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?” (యోబు 2:10) […] - [మనమే ఆయన ఇల్లు](https://samskarana.co.in/we-are-his-house/): “ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు, ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపెట్టినయెడల మనమే ఆయన యిల్లు”. (హెబ్రీ 3:3-6) యేసు క్రీస్తునందు నిరీక్షణ కలిగి, అతిశయించువారందరూ దేవుని ఇల్లు. అంటే, మోషే కాల౦లోనో లేదా భూమ్మీద యేసు సంచరించిన రోజుల్లోనో కాదు గాని నేటికి యేసు మనకు సృష్టికర్తయై, మన యజమానియై, మన పరిపాలకుడై, మనకు అన్నిటిని సమకూర్చేవాడుగా ఉన్నాడు. యేసు ఈ ఇంటి “నిర్మాణ కర్త” అని పిలువబడ్డాడు. మోషే కట్టేవాడు కాదు. మోషే ఇంట్లో ఒక భాగమై ఉన్నాడు. అందుచేత,“మోషే క౦టే ఎక్కువ మహిమకు అర్హుడిగా యేసు పరిగణి౦చబడ్డాడు, అంటే ఇంటికంటే […] - [మీ భయాలను తుడిచివేయండి](https://samskarana.co.in/erase-your-fears/): “నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను”. (కీర్తన 56:3) మన చింతకు మూలం అపనమ్మకంలో ఉందనే సత్యానికి ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, “నేను దాదాపు ప్రతిరోజూ చింతకు సంబంధించిన భావాలతో పోరాడుతుంటాను; కాబట్టి దేవుని కృప మీద నాకున్న విశ్వాసం సరిపోదని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను రక్షింపబడతాననే భరోసా ఉందా అని నేను ఆశ్చర్యపోతున్నాను” అనే విధంగా ఉంటుంది. ఈ విషయానికి సంబంధించి నా ప్రతిస్పందన ఏంటంటే మీరు కారు పందెంలో (రేసులో) ఉన్నారనుకోండి, మీరు పందెంలో గెలుపొందడానికి ఇష్టంలేని మీ శత్రువు మీ కారు విండ్ షీల్డ్ పై (అద్దంపై) బురదను విసిరాడని అనుకుందాం. మీరు మీ లక్ష్యాన్ని తాత్కాలికంగా పోగుట్టుకొని, పక్కదారి పట్టడం ప్రారంభించినంత మాత్రాన మీరు కారు పందెం నుండి వైదొలగిపోతున్నారని (ప్రక్కకు పోతున్నారని) అర్థం కాదు. మీరు పందెంలో వేరొక తప్పుడు మార్గంలో (రేస్ ట్రాక్ లో) ఉన్నారని కూడా కాదు. అలాగైతే, […] - [చరిత్ర ముగింపులో ఆశ్చర్యం](https://samskarana.co.in/surprise-at-the-end-of-history/): ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతి దండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట [దేవునికి న్యాయమే]. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరయందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. (2 థెస్స 1:7-10). యేసు తాను వాగ్దానం చేసినట్లుగానే ఈ భూమి మీదకి ఆయన తిరిగి వచ్చినప్పుడు, సువార్తను నమ్మనివారందరు, “ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు” అని పౌలు చెప్పాడు. ఈ సత్యాన్ని వినే అవిశ్వాసులందరినీ భయపెట్టే అతి భయంకరమైన పరిస్థితి ఇది. అయ్యో, ఈ లోకంలో […] - [మనం ఆనందించేదానిని మనం ఘనపరుస్తాం](https://samskarana.co.in/we-cherish-what-we-enjoy/): నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. (యెషయా 58:13-14). దేవుణ్ణి మహిమపరచకుండ దేవుణ్ణి వెంబడించడమనేది సాధ్యమే. మనం దేవుణ్ణి మహిమపరచాలనే తపనను కలిగి ఉన్నట్లయితే, ఆయనతో ఉన్నటువంటి సహవాస ఆనందం కోసం మనం తప్పకుండ ఆయనను వెంబడిస్తాం. దీనికి ఉదాహరణగా విశ్రాంతి దినాన్ని తీసుకోండి. దేవుని పరిశుద్ధ దినాన ప్రజలు తమకిష్టమైనవాటిని చేసేందుకు తాపత్రయపడేవారిని ఆయన గద్దిస్తున్నాడు. “నా పవిత్ర దినాన మీకిష్టమైన పనులు చేయకుండా, విశ్రాంతి దినము నుండి మీరు వ్యాపారము చేయకుండ ఉండాలి.” అయితే, ఇంతకి ఆయన ఏమని చెప్తున్నాడు? […] - [దేవుని ప్రేమ షరతులతో కూడినదా?](https://samskarana.co.in/is-gods-love-conditional/): కాదు గాని, ఆయన [దేవుడు] ఎక్కువ కృప నిచ్చును; అందుచేత – దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్ద నుండి పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. (యాకోబు 4:6-8)  “ఎక్కువ కృప” మరియు దేవుడు మన “యొద్దకు  వచ్చును” అనేవాటికి సంబంధించిన అమూల్యమైన అనుభవం ఉందని యాకోబు భక్తుడు మనకు బోధిస్తున్నాడు. “ఎక్కువ కృప” మరియు దేవుడు మన “యొద్దకు వచ్చును” అనేవి ఖచ్చితంగా అద్భుతమైన అనుభవాలే. అయితే, దేవుని ప్రేమకు సంబంధించిన ఈ అనుభవం షరతులు లేనిదా? అని నేను అడుగుతున్నాను. ఈ ప్రశ్నకు కాదని నేను చెప్తున్నాను. ఇది మనల్ని మనం తగ్గించుకోవడం మరియు మనం దేవునికి దగ్గరగా వెళ్ళడంపై షరతులతో కూడినది. “దేవుడు అహంకారులను […] - [ఒకరినొకరు సంతోషంగా ప్రేమించండి](https://samskarana.co.in/love-eachother-happily/): “మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు”. (మీకా 6:8) మరొక వ్యక్తిని సంతోషపరచడంలోనే ఒక వ్యక్తి ఆనందం సంపూర్తిచేయబడుతుందని చెప్పినంత మాత్రాన ఏ ఒక్కరూ ప్రేమించబడకుండ ఉండిపోరు. దయగల కార్యం నన్ను సంతోషపెడుతుందని చెప్పినప్పుడు నేను స్వార్థపరునిగా ఎంచబడను. వాస్తవానికి, ప్రేమతో చేసిన పనులు మనస్ఫూర్తిగా చేయబడినప్పుడు మాత్రమే అవి నిజమైనవి. అహిష్టతకు మంచి ప్రత్యామ్నాయం తటస్థంగానో, బాధ్యతాయుతంగానో ఉండటం కాదు గాని సంతోషంగా ఉండటం. ప్రేమకున్న నిజమైన మనస్సు ఏంటంటే కనికరాన్ని ప్రేమించడం (మీకా 6:8); ఇది కనికరాన్ని మాత్రమే చూపించదు. ఈ సత్యాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని క్రైస్తవ సుఖం (Christian Hedonism) బలవంతం చేస్తోంది.  మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; […] - [మీ రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా?](https://samskarana.co.in/are-you-neglectig-your-savation/): “ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందుము?” (హెబ్రీ 2:3)  మీ రక్షణ గురించి మీ మనస్సులో గొప్ప భావనను కలిగియున్నారా? లేక మీరు మీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారా? మీరు కలిగియున్న గొప్ప రక్షణ విషయమై మీరు స్పందిస్తున్నారా? లేక మీరు వ్రాసిన చివరి వీలునామాలాగా, చివరి నిబంధనలాగా, లేక మీ కారుకు మీరు పెట్టుకున్న ఒక బిరుదులాగా, లేక మీ ఇంటి మీద మీరు కలిగియున్న చట్టపరమైన పట్టాలాగా మీ రక్షణతో మీరు వ్యవహరిస్తున్నారా? మీరు దాని మీద ఒకసారి సంతకం చేసి, దానిని ఏ పెట్టెలోనో పెట్టుంటారు గాని అది వాస్తవానికి మీ మనస్సులో గొప్ప విషయంగా ఉండదు. దాని గురించి చాలా అరుదుగా ఆలోచిస్తారు. అది ప్రతి రోజు మీ మీద ఎటువంటి ప్రభావం చూపించదు. వాస్తవానికి మీరు దానిని నిర్లక్ష్యం చేస్తారు. అయితే, మీ గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం […] - [చింత యొక్క నిజమైన సమస్య](https://samskarana.co.in/a-genuine-reason-of-anxiety/): “నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.” (మత్తయి 6:30) చింతకు మూలం ఏంటంటే మన తండ్రి అనుగ్రహించే భవిష్యత్ కృపలో అరకొర విశ్వాసాన్ని కలిగి ఉండడమని, అంటే “అల్ప విశ్వాసం” కలిగి ఉండడమని యేసు చెప్తున్నాడు.  ఈ విషయంలో మన స్పందన ఇలా ఉండొచ్చు, “ఇది శుభవార్త కాదు! వాస్తవానికి చింతతో నిండియున్న స్వభావంతో పోరాటం మాత్రమేనని నేను భావించినదానికి బదులుగా, నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నానా లేదా అనే స్వభావంతో చేసే చాలా లోతైన పోరాటమని నేర్చుకోవడం అత్యంత నిరుత్సాహకరమైన విషయం.” ఈ నిరుత్సాహానికి నా ప్రతిస్పందన ఏదనగా దానిని అంగీకరించడం, ఆ తర్వాత దానిని విభేదించడం. ఎందుకనగా, మీరు కడుపు నొప్పితో బాధపడి, అన్ని రకాల మందులు వాడి మరియు అన్ని రకాల పత్యాలు పాటించి, ఎన్ని ప్రయత్నించినా ప్రయోజనం లేదనుకోండి. అప్పుడు, సాధారణమైన […] - [శ్రమల యొక్క అర్థం](https://samskarana.co.in/the-meaning-for-our-sufferings/): “మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, … అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను”. (హెబ్రీ 11:26) మనం శ్రమలు అనుభవించాలని చెప్పినందువలన మనం శ్రమలను అనుభవించడాన్ని ఎన్నుకోం గాని ఈ శ్రమలు నిత్య ఆనందానికి మార్గంగా ఉన్నాయని మనకు విశదీకరించి చెప్పినందున మనం శ్రమలను అనుభవించడాన్ని ఎన్నుకున్నాం.  కర్తవ్యం పట్ల మన భక్తి యొక్క బలాన్ని ప్రదర్శించడానికో, లేదా మన నైతిక సంకల్పం యొక్క శక్తిని ప్రదర్శించడానికో, లేదా శ్రమలో మన సహనం యొక్క ఔన్నత్యాన్ని నిరూపించడానికో కాకుండా, పిల్లలవంటి విశ్వాసాన్ని కలిగి ఉండటంలో ఆయన సంతృప్తికరమైన వాగ్దానాల అనంతమైన అమూల్యతను, అంటే వాటన్నిటి నెరవేర్పుగా ఆయన మహిమ యొక్క సంపూర్ణ గొప్పతనాన్ని మరియు సౌందర్యాన్ని వ్యక్తం చేయడానికి ఆయన మనల్ని శ్రమల యొక్క విధేయతలోకి ఆహ్వానిస్తాడు. “అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని [మోషే] యోచించి, […] - [శ్రమలో ఆనందించుట](https://samskarana.co.in/rejoice-in-sufferings/): “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి”. (మత్తయి 5:11-12) క్రైస్తవులుగా శ్రమలలో ఆనందించడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయని  క్రైస్తవ హెడోనిజం (Christian Hedonism) చెప్తోంది. సమస్తానికి చాలిన, సమస్తాన్ని తృప్తిపరచగలిగిన దేవుని కృపకు వ్యక్తీకరణగా వాటినన్నిటిని కొనసాగించాలి. పునరుత్థానంలో మనకు లభించేటువంటి గొప్ప బహుమానం మీద మన మనస్సులను స్థిరపరచుకోవడం ద్వారా శ్రమలలో ఆనందించే ఒక విధానం వస్తుంది. ఇటువంటి విధానం యొక్క ప్రభావం రాబోయే దానితో పోల్చినప్పుడు మన ప్రస్తుత శ్రమను ఎన్నికలేనిదిగా చేస్తుంది: “మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను” (రోమా 8:18; 2 కొరింథీ 4:16-18). శ్రమను సహించేలా చేయడంలో, మన బహుమానాన్నిబట్టి మనం సంతోషించడం ద్వారా ప్రేమించడం సాధ్యమౌతుంది. “మీరైతే […] - [మనలో క్రీస్తు శ్రమలు](https://samskarana.co.in/christs-sufferings-in-us/): “ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను”. (కొలొస్స 1:24)  పాపుల కోసం క్రీస్తు శ్రమలను అనుభవించి, చనిపోవడం ద్వారా లోకం కోసం ఆయన తన ప్రేమను వెల్లడి చేసియున్నాడు. ఇది పరిపూర్ణమైన అర్పణ. ఈ అర్పణ ప్రజలందరి పాపాల కోసం చెల్లించిన అర్పణ. ఇది ఉత్తమ బహుమానం అవ్వడం కోసం దానికి మరొకటి జతపరచనక్కరలేదు. క్రీస్తు తనను తాను లోకంలోని సమస్త దేశాలన్నిటికీ వ్యక్తపరుచుకోవడం తప్ప దానికి ఎటువంటి కోరతనేదే లేదు.  ఈ కొరతకు దేవుని జవాబు ఏంటంటే లోకానికి క్రీస్తు శ్రమలను వ్యక్తిగతంగా కనపరచడానికి క్రీస్తు ప్రజలను (అంటే, పౌలువంటి ప్రజలను) పిలవడమే. ఈ విధంగా చేయడంలోనే “కీస్తు బాధలలో కొదువైన దానిని మనం సంపూర్ణం చేయగలుగుతాం.” అంటే, వాటికున్న అత్యున్నతమైన విలువను ఎరుగని ప్రజలకు […] - [శ్రమల పాఠశాల](https://samskarana.co.in/the-seminary-of-suffering/): “అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను”. (2 కొరింథీ. 12:9) క్రైస్తవులందరి శ్రమల విషయంలో దేవుని విశ్వవ్యాప్త ఉద్దేశ్యం: దేవునిలో ఎక్కువ సంతృప్తి కలిగి తనపై అలాగే లోకంపై తక్కువ ఆధారపడటం. “నెమ్మదిగా మరియు సుఖంగా ఉండే సమయాల ద్వారా లోతైన పాఠాలు నేర్చుకున్నాను” అని ఎవరూ చెప్పడం నేను ఎప్పుడూ వినలేదు. కానీ బలమైన పరిశుద్ధులు ఇలా చెప్పడం నేను విన్నాను, “దేవుని ప్రేమ యొక్క లోతులను గ్రహించడంలో మరియు ఆయనలో లోతుగా ఎదగడంలో పురోగతి, శ్రమల ద్వారా వచ్చింది.” అత్యంత విలువైన ముత్యము క్రీస్తు మహిమ. ఈ విధంగా, మన శ్రమలలో క్రీస్తు యొక్క సర్వ-సమృద్ధి కృపా మహిమ విస్తరిస్తుందని పౌలు నొక్కిచెప్పాడు. మన విపత్తులో మనం ఆయనపై ఆధారపడినట్లయితే, ఆయన మన “నిరీక్షణతో కూడిన ఆనందాన్ని” కాపాడుతాడు, ఆయన సర్వ-సంతృప్తికరమైన కృపాబలములుగల దేవుడిగా ఉంటాడు. “మన చుట్టూ ఉన్నవి […] - [కొట్టుకొనిపోవడంలో ఉండే ప్రమాదం](https://samskarana.co.in/danger-of-being-swept-away/): “కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను”. (హెబ్రీ 2:1) ఇటువంటి వ్యక్తులను గూర్చి మనందరికీ తెలుసు. ఏదీ అత్యవసరమని అనుకోరు. ఏ విషయంలో కూడా అప్రమత్తతగా ఉండరు. ఏకాగ్రతతో వినడం గాని, యేసువైపు చూడటం గాని  లేదా ఆయనను గూర్చి ఆలోచించడం గాని చేయరు. దాని ఫలితంగా  స్థిరంగా లేకుండా కొట్టుకొనిపోతున్నారు.  ఇక్కడ విషయం ఏంటంటే: స్థిరంగా నిలబడటం లేదు. ఈ లోక జీవితం కేవలం ఒక సరస్సు కాదు. ఇది ఒక పెద్ద నది. మరియు అది నాశనానికి క్రిందికి ప్రవహిస్తోంది. మీరు యేసు చెప్పేది శ్రద్ధగా విని, ప్రతిరోజూ ఆయనను పరిగణలోకి తీసుకుని, గంటకోసారి ఆయనపై దృష్టి పెట్టకపోతే, మీరు నిశ్చలంగా నిలబడరు; మీరు వెనుకకు వెళ్తారు. మీరు క్రీస్తు నుండి దూరంగా కొట్టుకొనిపోతారు. క్రైస్తవ జీవితంలో కొట్టుకొనిపోవడం మరణకరమైన విషయం. హెబ్రీ 2:1 ప్రకారం దానికి నివారణ ఏదనగా: […] - [పాపం, సాతాను, రోగం, లేదా నాశనం](https://samskarana.co.in/sin-satan-disease-or-destruction/): “అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును”. (2 కొరింథీ 12:8-9) క్రైస్తవుడికి హింస వల్ల వచ్చే బాధ క్యాన్సర్ వల్ల వచ్చే బాధ ఒకటేనా? ఒకదాని కోసం ఇచ్చిన హామీలు మరొకదాని విషయంలో వర్తిస్తాయా? నా సమాధానం అవును. జీవితమంతా, దేవుని మహిమ కోసం మరియు ఇతరుల రక్షణ కోసం విశ్వాసంతో శ్రద్ధగా జీవించినట్లయితే, ఏదో ఒక రకమైన అడ్డంకులను మరియు శ్రమలను ఎదుర్కుంటాము.  విధేయుడైన క్రైస్తవుడికి వచ్చే శ్రమ, దేవుని విధేయత పిలుపుకు తగినట్టుగా జీవించడంలో ఒక భాగం. దేవుడు నిర్దేశించిన మార్గంలో క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఈ మార్గంలో ఆయన సార్వభౌమ సమకూర్పులో ఉన్నవాటన్నింటిని  మనం ఎంచుకున్నట్లే. ఈ విధంగా, […] - [గొప్ప ప్రతిఫలం](https://samskarana.co.in/a-great-reward/): “అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”. (మార్కు 10:29–30) యేసు చెప్పిన ఈ మాటల అర్థం ఏమిటంటే,  మీరు చేసే ప్రతి త్యాగానికి ఆయనే ప్రతిఫలం ఇస్తాడు. “మీరు ఫలానా త్యాగాలను చేశాను అని ఇంకెప్పుడు చెప్పకోలేని విధంగా నేను మీ కోసం కార్యాలు చేస్తానని, నేను మీ కోసం ఉంటానని వాగ్దానం చేస్తున్నాను” అని కాబోయే మిషనరీలకు యేసు చెప్తున్నాడు. పేతురు “త్యాగానికి” యేసు వైఖరి ఏమిటి? పేతురు అన్నాడు, “ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి” (మార్కు 10:28). యేసు మెచ్చిన “స్వీయ నిరాకరణ” స్ఫూర్తి ఇదేనా? ఇది కాదు, ఎందుకంటే యేసు పేతురును మందలించాడు. యేసు […] - [దేవునికి సాధ్యమే](https://samskarana.co.in/possible-with-god/): “ఈ దొడ్డివికాని వేరే గొర్రెలు నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును”. (యోహాను 10:16) ప్రపంచంలోని ప్రతి వర్గాలలో జాతులలో దేవునికి ప్రజలు ఉన్నారు. సృష్టికర్త శక్తితో సువార్త ద్వారా వారిని పిలుస్తున్నాడు. కావున వారు యేసును నమ్ముతారు! సరిహద్దుల్లోని కష్టతరమైన ప్రదేశాలలో నిరుత్సాహాన్ని అధిగమించే గొప్ప శక్తి ఈ మాటల్లో ఎంత ఉందో కదా! పీటర్ కేమరాన్ స్కాట్ కథ ఒక మంచి ఉదాహరణ. 1867లో గ్లాస్గోలో జన్మించిన స్కాట్ ఆఫ్రికా ఇన్‌ల్యాండ్ మిషన్ వ్యవస్థాపకుడు అయ్యాడు. ఆఫ్రికాలో అతని ప్రారంభం శుభప్రదమైనది. అతని మొదటి ఆఫ్రికా పర్యటన మలేరియా తీవ్రమైన దాడితో ముగిసింది, అది అతన్ని ఇంటికి పంపింది. అతను కోలుకున్న తర్వాత తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ సారి అతని సోదరుడు జాన్ అతనితో చేరినందున ఈ తిరిగి రావడం అతనికి ప్రత్యేకంగా సంతోషాన్నిచ్చింది. అయితే కొద్దిసేపటికే జాన్ జ్వరం […] - [మిషనరీకి ఔషధం](https://samskarana.co.in/medicine-for-the-missionary/): “దేవునికి సమస్తమును సాధ్యమే”. (మార్కు 10:27) సార్వభౌమ కృప అనేది క్రైస్తవ హెడోనిస్ట్‌కు జీవపు ఊట. క్రైస్తవ హెడోనిస్ట్ ఎక్కువ ఇష్టపడేది దేవుని సార్వభౌమ కృప తనని నింపడం మరియు ఇతరుల మేలు కోసం పొంగిపొర్లడం. క్రైస్తవ హెడోనిస్ట్ మిషనరీలు “నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను” (1 కొరింథీ 15:10) అనే అనుభవాన్ని ఇష్టపడతారు. వారి మిషనరీ శ్రమ ఫలం పూర్తిగా దేవునిదే (1 కొరింథీ 3:7; రోమా 11:36) అనే సత్యంలో వారు సేదతీరుతున్నారు. “నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.” (యోహాను 15:5) అని ప్రభువు చెప్పినప్పుడు వారు ఆ విషయమై సంతోషిస్తారు. కొత్త సృష్టి యొక్క అసాధ్యమైన బరువును దేవుడు వారి భుజాల మీద నుండి తీసివేసి తనపై వేసుకున్నాడనే సత్యమును బట్టి వారు సంతోషంతో గొర్రెపిల్లల్లా దూకుతారు. వారు అసూయ పెట్టుకోకుండా, “మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా […] - [గొప్ప మిషనరీ నిరీక్షణ](https://samskarana.co.in/the-great-missionary-hope/): “మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు”. (ఎఫెసీ 2:4-5) గొప్ప మిషనరీ నిరీక్షణ ఏమిటంటే, పరిశుద్ధాత్మ శక్తితో సువార్త బోధించబడినప్పుడు, మనిషి చేయలేనిది దేవుడు స్వయంగా చేస్తాడు: ఆయన రక్షించే విశ్వాసాన్ని సృష్టిస్తాడు. మనిషి పిలుపు చేయలేనిది దేవుని పిలుపు చేస్తుంది. ఇది చనిపోయినవారిని లేపుతుంది. ఇది ఆధ్యాత్మిక జీవాన్ని సృష్టిస్తుంది. ఇది సమాధిలో ఉన్న లాజరును యేసు “బయటికి రమ్మని” పిలిచినప్పుడు  చనిపోయిన వ్యక్తి లోబడి బయటకు వచ్చాడు కదా అటువంటి పిలుపు ఇది. ఈ పిలుపు జీవాన్ని సృష్టించడం ద్వారా విధేయతను సృష్టించింది (యోహాను 11:43). ఎవరైనా రక్షించబడేది అలాగే. మన పిలుపుతో మనం ఎవరినైనా నిద్ర నుండి మేల్కొల్పగలము, కాని దేవుని పిలుపు లేనివాటిని ఉన్నవాటిగా  మారుస్తుంది (రోమా ​​4:17). దేవుని పిలుపు అన్ని ప్రతిఘటనలను అధిగమించగలదు కాబట్టి అది ఆపలేనటువంటిది. అది దేవుని ఉద్దేశం నెరవేర్చడంలో […] - [క్రీస్తు సూర్యకాంతిలాంటివాడు](https://samskarana.co.in/christ-is-like-sunlight/): “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయున్నాడు”. (హెబ్రీయులు 1:3) తేజస్సుకు మహిమకు మధ్య ఉన్న సంబంధం లేదా సూర్యకాంతి కిరణాలకి సూర్యునికి మధ్య ఉన్న సంబంధం లాంటిదే యేసుకి దేవునికి మధ్య ఉన్న సంబంధం. దేవునికి మరియు సహజమైన వస్తువులకు మధ్య ఉన్న ఏ పోలికైనా అసంపూర్ణమైనదని మీరు దానిని నొక్కి నొక్కి చెప్తే అది వక్రీకరించబడుతుందని గుర్తుంచుకోండి. అయినప్పటికీ, ఉదాహరణకు పరిగణించండి.  1. సూర్యకాంతి కిరణాలు లేకుండా సూర్యుడు ఉండే సమయమంటూ ఏమీలేదు. వాటిని విడదీయలేము. తేజస్సులాగే మహిమ కూడా శాశ్వతమైనది. తండ్రియైన దేవునితో క్రీస్తు సహ-శాశ్వతుడు. 2. తేజస్సు ప్రసరించే మహిమ. ఇది మహిమ నుండి భిన్నమైనది కాదు. క్రీస్తుకు వేరుగా ఉన్న దేవుడు కానీ తండ్రికి భిన్నంగా ఉండడు. 3. ఆ విధంగా తేజస్సు నిత్యత్వంలో పుట్టింది, అది కూడా మహిమ లాగే – సృష్టించబడలేదు లేదా తయారు చేయబడలేదు. మీరు […] - [దేవుని నిర్ణయాత్మకమైన అంతిమ వాక్యం](https://samskarana.co.in/gods-final-decisive-word/): “పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను”. (హెబ్రీయులు 1:1-2) కుమారుడు ఈ లోకంలోకి రావడంతో అంత్య దినములు ప్రారంభమయ్యాయి. “ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను.” క్రీస్తు దినముల ప్రారంభం నుండి అంటే, మనకు తెలిసిన దేవుని రాజ్య అంతిమ పరిపూర్ణ స్థాపనకు ముందు ఉన్న దినములు, చరిత్రలోని చివరి దినములలో జీవిస్తున్నాము. హెబ్రీ పత్రిక రచయిత యొక్క ఉద్దేశ్యం ఇది: దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడిన మాటలు నిర్ణయాత్మకమైన అంతిమ మాటలు. కుమారుని స్వంత నిర్ణయం ద్వారా, యుగయుగాల కొరకు ఆ మాటలు కొత్త నిబంధన ప్రతులలో వ్రాయబడ్డాయి. నిర్ణయాత్మకమైన ఆఖరి దేవుని మాటలను కలలు ద్వారా ప్రతి తరమూ తనకు తానుగా తెలుసుకోవాలని వదిలేయకుండా దేవుడు దీని కోసం ఒక స్పష్టమైన ఏర్పాటు చేశాడు. ఈ మాటల తరువాత […] - [భార్యాభర్తల కోసం హేడోనిజం](https://samskarana.co.in/hedonism-for-husband-and-wife/): “సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను”. (ఎఫెసీ 5:24–25) ఇదే వివాహ వ్యవస్థలో దేవుడు ఏర్పాటు చేసిన ప్రేమ మాదిరి. భార్యాభర్తల పాత్రలు ఒకేలా ఉండవు. సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు నుండి భర్త ప్రత్యేక సూచనలను తీసుకోవాలి. భార్య తన ప్రత్యేక సూచనలను క్రీస్తుకు లోబడిన సంఘం కోసం దేవుడు రూపొందించిన వాటి నుండి తీసుకోవాలి. ఇలా చేయడం వలన, మానవ పతనం మూలముగా వచ్చిన పాపాత్మకమైన మరియు హానికరమైన దుష్పలితాల తిరుగుప్రయాణం ప్రారంభమవుతుంది. మానవ పతనం కారణాన్ని బట్టి ప్రేమపూర్వక శిరస్సుగా ఉండాల్సిన పురుషులు పురుషాదిపత్యంగల శత్రువుల్లాగా,  మరికొందరిలో సోమరితనం గలిగిన ఉదాసీనులుగా మారిపోయారు. అలాగే మానవ పతనం స్త్రీ యొక్క తెలివితేటలను మార్చేసింది. ఇష్టపూర్వకంగా లోబడవలసిన స్త్రీలు కొంతమంది […] - [వివాహ మర్మం](https://samskarana.co.in/the-mystery-of-marriage/): “మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు”. (ఎఫెసీ 5:31–32) ఇక్కడ ఎఫెసీ 5:31లో మోషే మాట్లాడిన ఆదికాండము 2:24ని పౌలు ఉటంకిస్తున్నాడు – మరియు దేవుడు మోషే ద్వారా చెప్పాడని యేసు చెప్పాడు (మత్తయి 19:5) – “పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.” ఆదాము పాపంలో పడకముందు మాట్లాడిన ఈ దేవుని వాక్యం క్రీస్తుకు మరియు సంఘమునకు సూచనగా ఉంది మరియు అందువల్ల గొప్ప రహస్యం అని పౌలు అంటున్నాడు. దీనర్థం ఏమిటంటే, దేవుడు స్త్రీ పురుషులను సృష్టించి, వివాహబంధాన్ని నిర్ణయించినప్పుడు, వారు ఒకరికొకరు ఎలా సంబంధం కలిగి ఉంటారనే దాని గురించి ఆయన పాచికలు వేయలేదు లేదా గడ్డిని గీయలేదు లేదా నాణెం తిప్పలేదు. తన […] - [ప్రార్థనలో మొదటి ప్రాధాన్యత](https://samskarana.co.in/first-priority-in-prayer/): “మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక”. (మత్తయి 6:9) ప్రభువు నేర్పిన ప్రార్థనలో, మన పరలోకపు తండ్రి నామమును పరిశుద్ధపరచమని అడగడమే ప్రార్ధనలో మొదటి ప్రాధాన్యత అని యేసు బోధించాడు. మనలో, సంఘంలో, ఈ లోకంలో, ప్రతిచోటా. ఇది ఒక విన్నపము, అభ్యర్థన అని గమనించండి. ఇది ప్రకటన లేదా ప్రశంస కాదు. ఇది ప్రశంసలను వ్యక్తపరచడం కాదు, కానీ విన్నపము. కొన్నేళ్లుగా నేను ప్రభువు ప్రార్థనను స్తుతితో ప్రారంభించినట్లు తప్పుగా చదివాను: “దేవుని స్తుతించండి, ప్రభువు పేరు పవిత్రమైనది, గౌరవించబడింది, ఘనపరచబడింది!” కానీ అవి ప్రశంసలు కాదు. ఇది ప్రార్థన. దేవుని నామము పవిత్రమయ్యేలా చూడవలసిందిగా దేవున్ని అడగటం. మత్తయి 9:38 కూడా ఇలాంటి వచనమే. ఇక్కడ యేసు తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. కూలీలుగా ఉన్న మనమే మనకంటే పంట గురించి బాగా తెలిసిన […] - [ప్రేమ యొక్క గొప్ప ఆనందం](https://samskarana.co.in/the-great-joy-of-love/): “తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు”. (ఎఫెసీయులు 5:29-30) ఆ చివరి మాటలను మరిచిపోవద్దు: “మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము.” ఇంతకు ముందు పౌలు చెప్పిన రెండు వచనాలను మరచిపోకండి. “మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని” తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి, క్రీస్తు తన ప్రజల పవిత్రతను, సౌందర్యమును మరియు సంతోషాన్ని వెంబడించడం ద్వారా తన ఆనందాన్ని వెంబడించాడని పౌలు రెండు విభిన్న మార్గాల్లో స్పష్టం చేశాడు. క్రీస్తు మరియు ఆయన వధువు మధ్య ఐక్యత చాలా అన్యోన్యమైనది (“ఏక శరీరం”) కాబట్టి ఆమెకు ఏదైనా మేలు చేస్తే అది తనకు తాను చేసుకున్న మేలు అవుతుంది. ఈ వచనం యొక్క స్పష్టమైన అర్ధం ఏమిటంటే, ప్రభువు తన వధువును పోషించడానికి,  సంరక్షించడానికి, పవిత్రపరచడానికి మరియు […] - [వివాహం విషయంలో యేసు ఆనందం](https://samskarana.co.in/jesus-joy-in-marriage/): పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను. (ఎఫెసీయులు 5:25–27) దాంపత్యంలో ఇన్ని కష్టాలు రావడానికి కారణం భార్యాభర్తలు తమ ఆనందాన్ని కోరుకోవడం కాదు, తమ జీవిత భాగస్వామి ఆనందంలో వారి ఆనందాన్ని కోరుకోకపోవడమే. మీ జీవిత భాగస్వామి యొక్క ఆనందంలో మీ ఆనందాన్ని వెతకడం భార్యాభర్తలకు బైబిల్ ఇచ్చే ఆదేశం. ఎఫెసీ 5:25-30లో వివాహం గురించిన వాక్యభాగం కంటే ఎక్కువ హేడోనిస్టిక్ వాక్యభాగం బైబిల్లో ఇంకెక్కడ లేదు. క్రీస్తు తన సంఘమును ప్రేమించిన విధంగానే తమ భార్యలను ప్రేమించాలని భర్తలకు చెప్పబడింది. ఆయన సంఘమును ఎలా ప్రేమించాడు? 27వ వచనం ఆయన “దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను” అని చెబుతోంది. కానీ […] - [నా జీవితంలో దేవుని చిత్తాన్ని నేను ఎలా కనుగొనగలను?](https://samskarana.co.in/how-do-i-find-gods-will-for-my-life/): దేవుడు మనలో ప్రతి ఒక్కరికి విభిన్నమైన నైపుణ్యాలు, కోరికలు, స్వభావాలు, మానసిక సామర్థ్యాలు, భావోద్వేగ శక్తులు, అభిరుచులు మొదలైనవాటిని ఇస్తాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన తలాంతులను ఉపయోగించి మనం ఏ పాత్రను పోషించాలో ఎలా తెలుసుకోవాలి? ఇది ఎల్లప్పుడూ ఉండే ప్రశ్న. నేడు ఈ ప్రశ్న సాండ్రా అనే ఓ కళాశాల విద్యార్థి నుండి వచ్చింది. “పాస్టర్ జాన్, నమస్కారం, నా పేరు సాండ్రా. నేను ఓహియో స్టేట్ యూనివర్శిటీ విద్యార్థిని. ఈ పాడ్‌కాస్ట్‌కు మరియు కాలేజీ విద్యార్థుల నుండి ప్రశ్నలు స్వీకరించడానికి మీరు చూపే ఉత్సాహానికి ధన్యవాదాలు. నేను దశాబ్దం క్రితం రక్షించబడ్డాను మరియు క్రీస్తుని ప్రేమిస్తున్నాను. నేను చదివే పుస్తకాలలో మరియు నేను హాజరయ్యే సదస్సులలో, నాపై మరియు నా జీవితంపై దేవుని పిలుపును అర్థం చేసుకోమని నాకు చెప్పబడుతున్నట్లు ఎక్కువగా అనిపిస్తుంది. నేను ఖచ్చితంగా అది తెలుసుకోవాలనుకుంటున్నాను! కానీ నాకు ఇక్కడ కొంత గందరగోళం ఉంది. “బహుశా […] - [సమృద్ధి యొక్క ఉద్దేశ్యం](https://samskarana.co.in/the-purpose-of-abundance/): “దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను”. (ఎఫెసీ 4:28) భౌతికమైన వాటితో ఎలా జీవించాలో మూడు స్థాయిలు ఉన్నాయి: (1) వాటిని పొందడానికి మీరు దొంగిలించవచ్చు; (2) లేదా వాటిని పొందడానికి మీరు పని చేయవచ్చు; (3) లేదా వాటిని ఇవ్వడానికి మీరు పని చేయవచ్చు. చాలా మంది, క్రైస్తవులమని చెప్పుకునేవారు రెండవ స్థాయిలో నివసిస్తున్నారు. మనము దొంగతనం మరియు పనిపాటు లేకుండా తిరిగేవారికి భిన్నంగా పనిని గౌరవిస్తాం. మనం దొంగతనాలు మరియు పనిపాటు లేకుండా తిరగడాన్ని తిరస్కరించి, నిజాయితీగా పని చేసుకొని నిజాయితీగా రోజుకి రావలసిన వేతనం తీసుకుంటే మనం ధర్మంగా వ్యవహరించినట్లు భావిస్తాము. అది చెడ్డ విషయమేమి కాదు. దొంగతనం మరియు పనిపాటు లేకుండా తిరిగడం కంటే పని చేయడం మంచి విషయం. కానీ అపొస్తలుడు మనల్ని దానికొరకు పిలవడం లేదు. మన సంస్కృతిలో ఉన్న ప్రతి ఒక్కరూ […] - [దేవుని రోషము వెలుగులో భయం మరియు నిరీక్షణ](https://samskarana.co.in/fear-and-hope-in-the-light-of-gods-wrath/): “ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు”. (నిర్గమకాండము 34:14) దేవుడు తన నామ ఘనత కోసం అనంతమైన రోషము కలిగి ఉంటాడు మరియు తన జీవిత భాగస్వామి మరొక ప్రేమికుడి వెంట పరుగెత్తినట్లు ఆయనకు చెందాల్సిన హృదయాలు వేరే వాటిని వెంబడిస్తే భయంకరమైన కోపంతో స్పందిస్తాడు. ఉదాహరణకు, యెహెజ్కేలు 16:38–40లో విశ్వాసం లేని ఇశ్రాయేలుతో ఇలా అన్నాడు, “జారిణులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి, క్రోధముతోను రోషముతోను నీకు రక్తము నియమింతును. వారి చేతికి నిన్ను అప్పగించెదను,నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి . . . నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసికొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు. వారు నీమీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తులచేత నిన్ను పొడిచి వేయుదురు.” ఈ హెచ్చరికను వినవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ విభజించబడని ప్రేమ మరియు […] - [ప్రార్థన గురించిన ప్రణాళిక](https://samskarana.co.in/a-plan-about-prayer/): “నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.  మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు. . . . మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను”. (యోహాను 15:7–8, 11) చేసిన ప్రార్థనకు సమాధానంగా మనం ఫలించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి యేసుతో ఫలభరితమైన సహవాసంలో ఉన్న ఆనందాన్ని ప్రార్థన వెంటాడుతుంది. దేవుని పిల్లలు సంతోషకరమైన, ఫలవంతమైన ప్రార్థన అలవాట్లను ఎందుకు కలిగి ఉండరు? నేను చెప్పేది తప్పు కాకపోతే, ఒక మాట చెబుతాను. మనం ప్రార్ధనను కోరుకోమని కాదు గాని దానికి ప్రణాళిక వేసుకోము.  మీరు నాలుగు వారాల సెలవు తీసుకోవాలనుకుంటే, మీరు వేసవి కాలము వచ్చిన తరువాత ఒక ఉదయం లేచి, “హే, ఈ రోజు వెళ్దాం!” అని చెప్పరు కదా. మీరు […] - [దేవుడు స్వస్థపరుస్తాడు](https://samskarana.co.in/god-heals/): “నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చు చున్నాడు”. (యెషయా 57:18–19) తిరుగుబాటు మరియు గర్వం అనే తీవ్రమైన వ్యాధితో ఉన్న మానవుని, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన ఎలా నయం చేస్తాడు? యెషయా 57:15లో దేవుడు “వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను” అని అంటున్నాడు. అయినప్పటికీ యెషయా 57:17లోని ప్రజలు వినయం కలిగిన వారు కాదు. వారు నిస్సంకోచంగా తమ గర్వించదగిన మార్గాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి, వైద్యం ఎలా ఉంటుంది? ఒకే ఒక మార్గం ఉంది. దేవుడు వారిని లొంగదీసుకుని స్వస్థపరుస్తాడు. ఆయన వారి గర్వాన్ని అణిచివేసి రోగమును నయం చేస్తాడు. వినయము మరియు దీనమనస్సు గలవారు మాత్రమే దేవుని సహవాసాన్ని ఆనందిస్తే (యెషయా 57:15), ఇశ్రాయేలు యొక్క అనారోగ్యం, గర్వం మరియు ఉద్దేశపూర్వక తిరుగుబాటు అయితే […] - [ప్రభువే సేవకుడు](https://samskarana.co.in/the-lord-is-our-minister/): “క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము”. . . (ఎఫెసీయులు 2:6) క్రీస్తు రెండవ రాకడను గురించి బైబిల్ ఇచ్చే అత్యంత ఆశ్చర్యకరమైన చిత్రం లూకా 12:35-37లో ఉంది, ఇది వివాహ విందు నుండి యజమాని తిరిగి రావడాన్ని ఈ విధంగా చిత్రీకరిస్తుంది: “మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురుచూచు మనుష్యులవలె ఉండుడి. ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” ఖచ్చితంగా చెప్పాలంటే, మనల్ని సేవకులు అంటారు – మరియు నిస్సందేహంగా మనము చెప్పింది చెప్పినట్లు ఖచ్చితంగా చేయాలని అర్థం. కానీ ఈ […] - [దేవుణ్ణి సేవించే విషయంలో జాగ్రత్త వహించండి](https://samskarana.co.in/be-careful-in-serving-god/): “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు”. (అపొ. కార్యాలు 17:24–25) మనం దేవునికి ఆయన అవసరాలను అందించడం ద్వారా మహిమపరచలేము, కానీ ఆయన మన అవసరాలను తీర్చగలడని ప్రార్థించడం ద్వారా – మరియు సమాధానం ఇస్తాడని విశ్వసించడం ద్వారా మరియు ఇతర వ్యక్తుల పట్ల ప్రేమతో మన జీవితాలను అర్పించినప్పుడు, శ్రద్ధతో  అన్నీ సమకూరుస్తాడనే నమ్మకంతో  ఆనందంగా  జీవించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఇక్కడ మనం క్రైస్తవ హీడోనిజం (సుఖమే ప్రధానం అనే సిద్ధాంతం) అందించే శుభవార్తలోని ప్రాముఖ్యమైన అంశం దగ్గర ఉన్నాము. ఆయన మహిమ పొందేలా సహాయం చేయమని మనం ఆయనను అడగాలని దేవుని పట్టుదల. “ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు” (కీర్తన […] - [  నేను మంచి మనస్సాక్షిని ఎలా కలిగి ఉండగలను?](https://samskarana.co.in/how-can-i-have-a-good-conscience/): శుభోదయం, నేటి పాడ్‌కాస్ట్‌వింటునందుకు ధన్యవాదాలు. మనం ఈ వారాన్ని అర్నాల్డో అనే ఒక శ్రోత నుండి వచ్చిన ఒక పదునైన మరియు బలమైన ప్రశ్నతో ప్రారంభిస్తున్నాము. “టోనీ మరియు పాస్టర్ జాన్ గార్లకు నమస్కారం. ఈ పాడ్‌కాస్ట్ కోసం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు! ఈ ప్రశ్నతో గత రెండు దశాబ్దాలుగా నేను ప్రయాసపడుతున్నాను. అది ఏమిటంటే: నేను మంచి మనస్సాక్షి కలిగి ఎలా జీవించగలను? అపొస్తలుడైన పౌలు తరచుగా మనస్సాక్షి గురించి మాట్లాడుతారు, ప్రత్యేకంగా ‘మంచి మనస్సాక్షి’తో జీవించడం అనేది అతడు క్రైస్తవుడిగా మారడానికి ముందు కూడా ఉన్న విషయమని తెలుస్తోంది (అపొస్తలుల కార్యములు 23:1; 24:16). అలాగే, ‘మంచి మనస్సాక్షి’ క్రైస్తవ నాయకుల కోసం అవసరమైన అర్హత అని మనం చూస్తాము (1 తిమోతికి 3:9). అంతేకాక, ‘మంచి మనస్సాక్షి’ కలిగి ఉండటం అనేది ప్రతి విశ్వాసికి క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం (1 తిమోతికి 1:5, […] - [మనము ఏమీ చేయలేము](https://samskarana.co.in/we-cant-do-anything/): “ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు”. (యోహాను 15:5) మీరు పూర్తిగా పక్షవాతానికి గురై, మాట్లాడటం తప్ప మీరు మీ కోసం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు అనుకుందాం. బలమైన మరియు నమ్మకమైన స్నేహితుడు మీతో కలిసి జీవిస్తానని మరియు మీకు కావలసినది చేస్తానని వాగ్దానం చేశాడనుకుందాం. అపరిచితుడు మిమ్మల్ని చూడటానికి వస్తే ఈ స్నేహితుడిని ఎలా కీర్తిస్తావు? మంచం మీద నుండి లేచి ఆయనని మోయడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఆయన దాతృత్వాన్ని మరియు బలాన్ని కీర్తిస్తారా? లేదు! మీరు ఇలా అంటారు, “మిత్రమా, దయచేసి రండి నన్ను పైకి లేపండి, మరియు నేను నా అతిథిని చూడగలిగేలా నా వెనుక ఒక దిండు వేస్తారా? మరియు దయచేసి నా కళ్ళద్దాలు నాకు తొడగరా?” కాబట్టి మీ సందర్శకుడు మీ […] - [అత్యుత్తమ వాక్యభాగం](https://samskarana.co.in/great-scripture-portions/): “పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను”. (రోమా 3:25–26) రోమా ​​3:25-26 బైబిల్‌లోని అత్యంత ముఖ్యమైన వచనాలు కావచ్చు. దేవుడు పూర్తిగా నీతిమంతుడు! మరియు ఆయన భక్తిహీనులను నీతిమంతులుగా తీరుస్తాడు! నిజమేనా? దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తున్న న్యాయమైన న్యాయమూర్తి! ఇది లేదా అది అని కాదు! రెండూ నిజాలే! ఆయన దోషిని నిర్దోషిగా ప్రకటిస్తాడు, కానీ అలా చేయడంలో ఆయన దోషి కాదు. ఇది ప్రపంచంలోనే గొప్ప వార్త! మన సృష్టికర్త తీర్పు క్రింద ఉన్నాము మరియు మన పాపంపై శాశ్వతమైన ఉగ్రతను కురిపించడం ద్వారా తన విలువైన కీర్తిని కాపాడుకోవడానికి ఆయన తన స్వంత నీతిగల స్వభావానికి కట్టుబడి ఉన్నాడనేది […] - [దేవుని జ్ఞానయుక్తమైన దయ](https://samskarana.co.in/gods-wise-grace/): “అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు”. (1 కొరింథీయులు 1:23–24) మనం సృష్టికర్త తీర్పు క్రింద ఉన్నాము మరియు మన పాపంపై శాశ్వతమైన ఉగ్రతను కురిపించడం ద్వారా తన విలువైన కీర్తిని కాపాడుకోవడానికి ఆయన తన స్వంత నీతిగల స్వభావానికి కట్టుబడి ఉన్నాడనే భయానక వార్తకు వ్యతిరేకంగా, సువార్త యొక్క అద్భుతమైన వార్త ఉంది. ఇది ప్రకృతి నుండి ఎవరూ నేర్చుకోలేని సత్యం. సువార్త యొక్క సత్యాన్ని పొరుగువారికి చెప్పాలి మరియు సంఘములలో బోధించాలి మరియు మిషనరీలు తీసుకువెళ్లాలి. శుభవార్త ఏమిటంటే, మొత్తం మానవ జాతిని శిక్షించకుండా తన న్యాయమైన హక్కులను తీర్చడానికి దేవుడు స్వయంగా ఒక మార్గాన్ని నిర్ణయించాడు. పాపుల లెక్కలు తేల్చడానికి మరియు ఆయన న్యాయాన్ని పైకెత్తడానికి నరకం ఒక మార్గం. కానీ మరొక మార్గం […] - [మనకు మేలు చేయుటే దేవుని ఆనందం](https://samskarana.co.in/it-is-gods-pleasure-to-do-good-to-us/): “నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయు చున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను”. (యిర్మీయా 32:40–41). దేవుడు మన నుండి ప్రశంసలు పొందడం మరియు మనం ఆయనలో ఆనందాన్ని పొందడం ఒకటే అన్వేషణ. మహిమపరచబడాలనే దేవుని తపన మరియు సంతృప్తి చెందాలనే మన తపన రెండూ ఈ ఒక్క అనుభవంలోనే నెరవేరుతుంది: దేవునిలో మనకున్న ఆనందం, స్తుతితో పొంగిపొర్లుతుంది. దేవునికి, ఆయన స్వంత శ్రేష్ఠతను బట్టి అతని ప్రజల గుండెలలో వినిపించే మధురమైన ప్రతిధ్వనే ప్రశంసలు. మనకు, దేవునితో సహవాసం చేయడం ద్వారా వచ్చే సంతృప్తి యొక్క శిఖరమే ప్రశంసలు. ఈ ఆవిష్కరణ యొక్క అద్భుతమైన ఆలోచన ఏమిటంటే, దేవుని హృదయం తన స్వంత మహిమను వెంబడించేలా చేసే సర్వశక్తిమంతుని […] - [మనము కనిపెట్టుకొని ఉంటాము, కార్యం ఆయన చేస్తాడు](https://samskarana.co.in/we-wait-upon-god-he-works/): “తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు”. (యెషయా 64:4) దేవుడు నా కోసం కార్యము చేయడం ద్వారా తన దైవత్వాన్ని చూపించడానికి ఇష్టపడతాడు మరియు నా కోసం ఆయన చేసే కార్యం ఎప్పుడూ నేను ఆయన కోసం చేసే కార్యానికి ముందు, క్రింద మరియు లోపలే ఉంటుంది.  ఈ సత్యం కంటే ఎక్కువ ఆనందాన్ని కలిగించే విషయం మరొకటి లేదు. ఆయన మన కోసం పని చేస్తాడని చెప్పడం మొదట గర్వంగా దేవుడిని కించపరచినట్లుగా అనిపించవచ్చు. నేను యజమానిని మరియు దేవునికి ఉద్యోగం కావాలి అనే విధంగా అర్ధంచేసుకోవడం వల్ల అలా అనిపిస్తుంది. దేవుడు మన కోసం చేస్తున్న పనిని గురించి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు దానర్థం అది కాదు. దేవుడు “తనకొరకు కనిపెట్టువాని విషయమై తన కార్యము సఫలముచేయును” (యెషయా 64:4) అని చెప్పినప్పుడు యెషయా మనస్సులో అది […] - [సంతోషకరమైన దేవుడు](https://samskarana.co.in/god-is-a-happy-god/): శ్రీమంతుడగు [ఆనందించే] దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్తప్రకారము, హితబోధకు….. (1 తిమోతి 1:8,10) దేవుని మహిమలో గొప్ప భాగం ఆయన ఆనందం. దేవుడు అనంతమైన ఆనందాన్ని నిరాకరించగలగీ మహిమాన్వితమైనవాడుగా ఉండగలడని అపొస్తలుడైన పౌలు ఊహించలేడు. అనంతమైన మహిమాన్వితంగా ఉండటమంటే అనంతమైన ఆనందంగా ఉండటమే. ఆయన “శ్రీమంతుడగు [ఆనందించే] దేవుడు. . . ఆయన మహిమగల సువార్త” అనే మాటలను ఉపయోగించాడు, ఎందుకంటే దేవుడు సంతోషంగా ఉండటం – అనంతమైన ఆనందంగా ఉండటం మహిమాన్వితమైన విషయం. దేవుని మహిమలో ఆయన మన ఊహకు అందనంత సంతోషంగా ఉన్నాడు. ఇది సువార్త: ” శ్రీమంతుడగు [ఆనందించే] దేవుడు. . . ఆయన మహిమగల సువార్త.” అది బైబిల్లోని వాక్యం. దేవుడు మహిమాన్వితమైన సంతోషాన్ని పొందడం శుభవార్త. సంతోషంగా లేని దేవునితో శాశ్వతత్వం గడపాలని ఎవరూ కోరుకోరు. దేవుడు సంతోషంగా లేనట్లయితే, సువార్త యొక్క లక్ష్యం సంతోషకరమైన లక్ష్యం కాదు, మరియు అది […] - [న్యాయం జరుగుతుంది](https://samskarana.co.in/justice-will-be-done/): “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది”. (రోమా 12:19) మీ అందరికీ ఎప్పుడో ఒక్కసారి అన్యాయం జరిగే ఉంటుంది. మీలో చాలా మంది, బహుశా, క్షమాపణలు చెప్పని విధంగా లేదా సరిదిద్దడానికి తగినంతగా ఏమీ చేయని వారిచే తీవ్రంగా అన్యాయం చేయబడి ఉండవచ్చు. మరియు మీరు ఆ బాధను మరియు ఆ చేదు అనుభవాన్ని విడిచి పెట్టలేకపోవడానికి లోతైన అవరోధాలలో ఒకటి, న్యాయం జరగాలి అనే దృఢ నిశ్చయం అయ్యిఉండవచ్చు, అది న్యాయబద్ధమైన నిశ్చయం. ప్రజలు భయంకరమైన తప్పుల నుండి తప్పించుకొని అందరినీ మోసగించగలిగితే విశ్వం యొక్క నైతిక బట్టలు విప్పినట్లే. క్షమించడానికి మరియు పగను విడిచిపెట్టడానికి ఉన్న అవరోధాలలో ఇది ఒకటి. ఇది ఒక్కటే కాదు. ఎదుర్కోవటానికి మన సొంత పాపం ఉంది. ఇది కూడా నిజమైన అవరోధమే. దాన్ని వదిలేయడం […] - [అవధుల్లేని ఆనందం](https://samskarana.co.in/boundless-joy/): “నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను”. (యోహాను 17:26) మరణించడానికి ముందు రాత్రి యేసు ఇలానే ప్రార్థించాడు. ఎంతో ఆనందకరమైనదాన్ని ఎప్పటికీ అశేష శక్తితో మరియు ఆసక్తితో ఆస్వాదించగలగడాన్ని ఊహించండి. ఇది ఇప్పుడు మన అనుభవం కాదు. ఈ లోకంలో మన సంపూర్ణ సంతృప్తికి మూడు విషయాలు అడ్డుగా నిలుస్తాయి. ఒకటి, ఈ సృష్టిలో ఏదీ మన హృదయాలలోని లోతైన కోరికలను తీర్చగలిగేంత గొప్ప వ్యక్తిగత విలువను కలిగి లేదు. మరొకటి ఏమిటంటే, అత్యుత్తమ సంపదలను వాటిని సంపూర్ణంగా ఆస్వాదించే శక్తి మనకు లేదు. మరియు పరిపూర్ణ సంతృప్తికి మూడవ అడ్డంకి ఏమిటంటే, మన ఆనందాలు ముగిసిపోతాయి. అవి శాశ్వతమైనవి కావు. కానీ యోహాను 17:26లోని యేసు లక్ష్యం మరియు ప్రార్థన నిజమైతే, ఇవన్నీ మారుతాయి. “తండ్రీ, నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు […] - [పరిపూర్ణ, సార్వభౌమ, సర్వశక్తిమంతుని ప్రేమ](https://samskarana.co.in/perfect-sovereign-almighty-love/): “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.” (నిర్గమకాండము 34:6) దేవుడు విస్తారమైన కృపాసత్యములు గలవాడు. నా మదిలో రెండు చిత్రాలు మెదులుతున్నాయి: 1. పర్వత శిఖరంపై ప్రేమ మరియు విశ్వాస్యతను నింపే తరగని నీటి బుగ్గ వంటిది దేవుని హృదయం. శతాబ్దాల తరబడి నీటి బుగ్గ ప్రవహిస్తూనే ఉంటుంది. 2. దేవుని హృదయం అగ్నిపర్వతం లాంటిది, అది ప్రేమతో చాలా వేడిగా కాలిపోతుంది, అది పర్వత శిఖరాన్ని పేల్చివేస్తుంది మరియు ప్రేమ మరియు విశ్వసనీయత యొక్క లావాతో సంవత్సరాల తరబడి ప్రవహిస్తుంది. దేవుడు “విస్తారమైన కృపాసత్యములు” గలవాడు – అనే మాట  ఉపయోగించినప్పుడు ఆయన ప్రేమ కార్యాలు పరిమితం కాదని మనం అర్థం చేసుకొని అనుభూతి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు ఈ పర్వత ఊటలో నుండి రోజంతా, సంవత్సరాల తరబడి, తరతరాలు త్రాగవచ్చు మరియు అది ఎప్పటికీ ఎండిపోదు. దేవుడు అవసరమైనప్పుడు ఎక్కువ డబ్బు ముద్రించే […] - [దేవుడు దిగాలుగా ఉండడు](https://samskarana.co.in/god-is-not-lazy/): అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. (కీర్తనలు 33:10-11) “మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు” (కీర్తన 115:3). ఈ వచనం యొక్క అంతరార్థం ఏమిటంటే, దేవుడు తనకు సంతోషాన్ని కలిగించే ప్రతిదాన్ని చేసే హక్కు మరియు బలము కలిగి ఉంటాడు. దేవుడు సార్వభౌముడు అని చెప్పడం అంటే ఇదే. ఒక్కసారి ఆలోచించండి: దేవుడు సార్వభౌమాధికారం కలిగి ఉండి, తనకు నచ్చినది ఏదైనా చేయగలిగితే, ఆయన ఉద్దేశాలు జరగక మానవు. “అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.” (కీర్తనలు 33:10-11). మరియు ఆయన ఉద్దేశాలు ఏవీ విఫలం కాకపోతే, ఆయన అన్నింటికంటే అందరికంటే సంతోషంగా ఉండి ఉండాలి. ఈ అనంతమైన, దైవిక ఆనందం […] - [సర్వ సంతృప్తిని కలిగించేది](https://samskarana.co.in/%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5-%e0%b0%b8%e0%b0%82%e0%b0%a4%e0%b1%83%e0%b0%aa%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%95%e0%b0%b2%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%87/): యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. (కీర్తన 37:4) ఆనందమును అన్వేషించాలా వద్దా అనేది మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు,  ఎందుకంటే కీర్తనలలో అలా చేయమని ఆజ్ఞాపించబడింది: “యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును” (కీర్తన 37:4). కీర్తనాకారులు దీన్ని చేయడానికి ప్రయత్నించారు: “దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది” (కీర్తనలు 42:1-2). “నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.” (కీర్తనలు 63:2). మనుష్యులు “నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు” (కీర్తన 36:8) అని కీర్తనాకారుడు అనటంలో అర్ధం దాహాన్ని తీర్చేది ఒకటి ఉంది అని అర్ధం.   మన ఆరాధనకు మూలమైన దేవుని మంచితనానికి ప్రతిగా మీరు […] - [అత్యంత స్వతంత్రతనిచ్చే ఆవిష్కరణ](https://samskarana.co.in/a-highly-liberating-innovation/): “మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి”. (ఫిలిప్పీ 3:1) దేవునిలో మనం ఆనందించడం ద్వారా ఆయన మహిమపరచబడతాడని నాకు ఎవరూ బోధించలేదు, దేవునిలో ఉండే ఆ ఆనందమే మన స్తుతులు దేవునికి ఘనతను తెస్తాయే గానీ వేషధారణను కాదు. అయితే, జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు చాలా స్పష్టంగా, శక్తివంతంగా చెప్పిన విషయం ఏంటంటే: దేవుడు రెండు విధాలుగా తాను సృష్టించిన జీవుల ద్వారా తనను తాను మహిమపరుచుకుంటాడు: (1) వారి అవగాహనలో… కనిపించడంలో; (2) వారి హృదయాలకు తనను తాను తెలియజేయడంలో మరియు వారు ఆనందపడటంలో, సంతోషించడంలో మరియు తన గురించి తాను ప్రత్యక్షపరచుకున్నవాటిలో ఆనందించడంలో. . . కనిపిస్తున్న తన మహిమ ద్వారా మాత్రమే దేవుడు మహిమపరచబడడు గాని ఆ మహిమలో ఆనందించడం ద్వారా కూడా మహిమపరచబడతాడు…. ప్రజలు దేవుని మహిమను చూసినప్పుడు కంటే దానిని ఆనందించినప్పుడు దేవుడు మరింత ఉన్నతమైనవాడు. దేవుని మహిమ గురించి సాక్ష్యమిచ్చే వ్యక్తి దేవుణ్ణి […] - [అపనమ్మకంతో పోరాటం చేయండి](https://samskarana.co.in/fight-distrust/): “ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి”. (ఎఫెసీ 6:16-17) నేను వృద్ధాప్యం గురించి చింతిస్తున్నప్పుడు, “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తలవెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే, నేనే చేసియున్నాను, చంకపెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే” (యెషయా 46:4) అనే ఈ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని నేను అపనమ్మకానికి విరుద్ధంగా పోరాడుతాను. నేను చనిపోవడం గురించి చింతిస్తున్నప్పుడు, “మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువు వారమై యున్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను” (రోమా 14:7-9) అనే వాగ్దానాన్ని ఆధారం […] - [మన మంచి కూడా ఆయన మహిమ కోసమే ](https://samskarana.co.in/even-our-good-is-for-his-glory/): “నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.” (మత్తయి 6:6) క్రైస్తవ సుఖ భోగానికి (Christian Hedonism) ఒక సాధారణ అభ్యంతరం ఏంటంటే ఇది దేవుని మహిమకంటే మానవ అభీష్టాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం, అంటే ఇది దేవుని గౌరవించుటకంటే నా సంతోషం అనే దానికి ప్రాధాన్యతనివ్వడం. అయితే క్రైస్తవ సుఖ భోగం (Christian Hedonism) ఇలాంటివి చేయదు.  ఖచ్చితంగా చెప్పాలంటే, క్రైస్తవ సుఖ భోగస్తులుగా మనం మన ఆసక్తిని, మన సంతోషాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. యువకుడైన జోనాథన్ ఎడ్వర్డ్స్ చేసిన తీర్మానాన్ని మేము సమర్ధిస్తున్నాము, అదేంటంటే, నాకు సాధ్యమైనంతగా నా పూర్ణ శక్తితో బలంతో తీవ్రతతో ఏ విధంగానైనా పరలోకంలో వీలైనంత అధిక సంతోషాన్ని పొందాలని తీర్మానించుకున్నాను. అయితే, దేవునికున్న ఆసక్తి ఏంటంటే ఆయన అవసరం ఎంతో ఎక్కువగా ఉన్నటువంటి పాపులమైన మనపట్ల […] - [అత్యున్నత వాగ్దానపు శక్తి](https://samskarana.co.in/the-power-of-supreme-promise/): “నేను మీ ఉపదేశాలను వెదికాను కాబట్టి నేను స్వతంత్రంగా నడవగలుగుతున్నాను”. (కీర్తన 119:45 స్వేచ్చానువాదం) ఆనందానికి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే స్వతంత్రం (స్వేచ్చ). మనం ద్వేషించే దాని నుండి విముక్తి పొందకపోతే మరియు మనం ప్రేమించిన దాని కోసం స్వేచ్ఛగా ఉండకపోతే మనలో ఏ ఒక్కరు సంతోషంగా ఉండరు. నిజమైన స్వేచ్ఛ మనకు ఎక్కడ దొరుకుతుంది? “నేను మీ ఉపదేశాలను వెదికాను కాబట్టి నేను స్వతంత్రంగా నడవగలుగుతున్నాను” అని కీర్తన 119:45 చెప్తోంది. ఈ సాదృశ్య చిత్రం బహిరంగ ప్రదేశాలలో ఒకటి. ఈ మాట మనల్ని సంకుచితమైన మనస్సు నుండి విడుదల కలుగజేస్తుంది. “దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను” (1 రాజులు 4:29). ఈ మాట బెదిరింపుతో కూడిన నిర్బంధాల నుండి మనల్ని విడుదల చేస్తుంది “విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను…” (కీర్తన 18:19). “సత్యమును గ్రహించెదరు; సత్యము మిమ్మును […] - [దేవుని సార్వభౌమాధికార శక్తిలో నిశ్చయత కలిగి జీవించండి](https://samskarana.co.in/live-confident-in-gods-soverign-power/): “విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో”,…. (ఎఫెసీ 1:19) దేవుని సర్వశక్తి స్వభావమనేది ప్రాపంచిక స౦ఘటనలతో సంబంధం లేకుండా ఆయన నిత్య మహిమలో శాశ్వతమైన, అచంచలమైన ఆశ్రయాన్ని ఇస్తు౦ది. ఆ నిశ్చయతే దేవుని పిలుపుకు, తీవ్రమైన విధేయతకు శక్తియైయున్నది. రోజంతా మరియు ప్రతిరోజూ, సాధారణ మరియు అసాధారణ అనుభవాలన్నిటిలో సర్వశక్తిమంతుడైన దేవుడే మీకు ఆశ్రయమనే సత్యాన్ని మించిన స్వాతంత్ర్యం, ఉత్సాహం లేదా మరింత ఎక్కువగా బలపరిచేది జీవితంలో ఏదైనా ఉందా?  ఈ విషయాన్ని మనం నమ్మినట్లయితే, దేవుని సర్వశక్తికి సంబంధించిన ఈ సత్యం మనల్ని పట్టుకుంటే, మన వ్యక్తిగత జీవితాలలో మరియు మన పరిచర్యలలో ఎంత పెను మార్పు వస్తుందో! దేవుని రక్షించే ఉద్దేశాల కోసం మనం ఎంత వినయంగా, ఎంత శక్తివంతంగా మారిపోతామో!  దేవుని సర్వశక్తి అంటే దేవుని ప్రజలకు ఆశ్రయం అని అర్థం. మీ ఆశ్రయం సర్వశక్తిమంతుడైన దేవుని సర్వశక్తియని మీరు నిజంగా నమ్మినప్పుడు, […] - [దేవుని వాక్యంపైనే జీవితం ఆధారపడి ఉంది](https://samskarana.co.in/life-depends-on-the-word-of-god/): “మరల వారితో ఇట్లనెను – “మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మనస్సులలో పెట్టుకొని, మీ సంతతివారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారికాజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్థకమైన మాటకాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశములో దీనినిబట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు.” (ద్వితీయో 32:46-47) దేవుని వాక్యము నిరర్థకం కాదు; ఇది జీవమరణాలకు సంబంధించినది. మీరు లేఖనాలను నిరర్థకంగాను లేదా శక్తిలేని మాటలుగాను పరిగణిస్తే, మీరు జీవితాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉంటారు. మన భౌతిక  జీవితం కూడా దేవుని వాక్యం మీదనే ఆధారపడి ఉంది, ఎందుకంటే ఆయన వాక్కు ద్వారానే మనం సృష్టించబడ్డాం (కీర్తన 33:6; హెబ్రీ 11:3) మరియు “తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించాడు” (హెబ్రీ 1:3). మన ఆధ్యాత్మిక  జీవితం దేవుని వాక్యము ద్వారానే మొదలవుతుంది: “ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు […] ## Pages - [సెమినార్స్](https://samskarana.co.in/%e0%b0%b8%e0%b1%86%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/): Meet the Speakers​ Our bench of speakers includes some well-established and successful designers who are known to be ruling the industry for years. Join the seminar and take a step closer to being an expert. Where Javits Center – 655 West 34th Street, New York, NY 10001 When 10-13 December, 2018 Monday to Tuesday - [Refund Policy](https://samskarana.co.in/refund_returns/): Effective Date: 20 February 2026Website: www.samskarana.co.in Introduction Samskarana is a registered Public Charitable and Religious Trust engaged in conducting conferences, seminars, training programs, and charitable activities within India  Donations All donations made to Samskarana are voluntary contributions towards the charitable and religious objectives of the Trust. Refunds may be considered only in the following cases: If approved, refunds will be processed to the original payment method within 7–10 working days after verification. Event / Seminar / Conference Registration Fees Registration fees paid for seminars, conferences, workshops, retreats, or other events are non-refundable, except as stated below. If an event is […] - [సంఘ కాపరుల సహవాసం](https://samskarana.co.in/fellowship-of-pastors/): సంఘ కాపరుల సహవాసం గురించి ఎన్నిసార్లు కలుస్తాం? కలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే.. రిజిస్ట్రేషన్ విరాళం రిజిస్ట్రేషన్ ఫారమ్: - [సంఘ కాపరుల సహవాసం గురించి](https://samskarana.co.in/new-page-information/): ఎన్నిసార్లు కలుస్తాం? కలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే.. రిజిస్ట్రేషన్ విరాళం రిజిస్ట్రేషన్ ఫారమ్: - [Sample Page](https://samskarana.co.in/sample-page/): This is an example page. It’s different from a blog post because it will stay in one place and will show up in your site navigation (in most themes). Most people start with an About page that introduces them to potential site visitors. It might say something like this: Hi there! I’m a bike messenger by day, aspiring actor by night, and this is my website. I live in Los Angeles, have a great dog named Jack, and I like piña coladas. (And gettin’ caught in the rain.) …or something like this: The XYZ Doohickey Company was founded in 1971, […] - [మా టీమ్](https://samskarana.co.in/our-team/) - [సంప్రదించండి](https://samskarana.co.in/contact/) - [The Power of Holy Scriptures](https://samskarana.co.in/registration-form/) - [మేము ఎవరము](https://samskarana.co.in/who-we-are/) - [మేము నమ్మేవి ](https://samskarana.co.in/statement-of-faith/): పరిశుద్ధ లేఖనాలుపాత మరియు క్రొత్త నిబంధన పుస్తకాలు దేవుని మాట వలన స్పూర్తి పొంది, అసలు ప్రతులలో ఎటువంటి తప్పులు లేవని మేము విశ్వసిస్తాం. ఈ స్పూర్తి, లేఖనాలలో ప్రతి భాగానికి పూర్తిగా మరియు సమానంగా వర్తిస్తుందనీ, అదేవిధంగా అవి విశ్వాసి జీవితంలో అంతిమ అధికారం కలిగి ఉంటాయని మేము విశ్వసిస్తాం. (యోహాను 5:39, 17:8, 26:2; 2 తిమోతీ 3:16-17, 2 పేతురు 1:21) కాబట్టి, లేఖనాలకు విరుద్ధంగా ఉన్న ప్రతీ బోధని, పరిశుద్ధ బైబిల్ తో సమానపరచుకునే ప్రతీ రాతని మేము వ్యతిరేకిస్తాం. త్రిత్వంశాశ్వతంగా ముగ్గురు వ్యక్తులుగా ఉన్న త్రియేక దేవుణ్ణి మాత్రమే మేము నమ్ముతున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ ముగ్గురు ఒకే స్వభావం, ఒకే గుణలక్షణాలు, ఒకే పరిపూర్ణత కలిగి, ఆరాధనకు, విధేయతకు సమాన యోగ్యత కలిగి ఉన్నారని మేము విశ్వసిస్తాం. (మత్తయి 28:19-20, యోహాను 1:1-4) కాబట్టి, త్రియేక దేవుణ్ణి తిరస్కరించే ప్రతీ బోధని మేము […] - [Samskarana](https://samskarana.co.in/) - [My account](https://samskarana.co.in/my-account/) - [Checkout](https://samskarana.co.in/checkout/) - [Cart](https://samskarana.co.in/cart/) - [Shop](https://samskarana.co.in/shop/) - [Thankyou page](https://samskarana.co.in/thankyou-page/): Thank you for Registering. See you on 15 August 2024.Please continue to pray for the seminar.Please contact 9855 33 9855 for any additional information/ queries. (నమోదు చేసినందుకు ధన్యవాదాలు. 15 ఆగస్టు 2024న కలుద్దాం.దయచేసి సెమినార్ కొరకు ప్రార్ధించండి.ఏవైనా అదనపు సమాచారం/ సందేహాల కొరకు దయచేసి 9855 33 9855 నెంబరును సంప్రదించండి.) - [Gautami](https://samskarana.co.in/gautami/): జాన్ పైపర్ చేత అనుదిన ధ్యానాం దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. (రోమా 8:28) మనం అనుభవిస్తున్న శ్రమలకు అతి సూక్ష్మ కారణాలను మనం అరుదుగా తెలుసుకుంటాం, అయితే విశ్వాసాన్ని కాపాడుకునే అతి పెద్ద కారణాలను బైబిల్ మనకు అందిస్తోంది. మనం శ్రమల పాలైనప్పుడు, లేక ఇతరుల శ్రమలలో వారికి సహాయం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు విశ్వాసాన్ని కాపాడే కారణాలను జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. తద్వారా, నిరీక్షణను కోల్పోకుండా మనకు సహాయం చేయడానికి దేవుడు మనకిచ్చిన కొన్ని సత్యాలను మనమిప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి 5 విషయాలు ఈ క్రింద చెప్పబడ్డాయి (ఒకవేళ ఇవి ఉపయోగకరంగా ఉన్నట్లయితే వాటిలో మూడు విషయాలను గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి). మన శ్రమలలో దేవుని యొక్క అతి పెద్ద కారణాలలో ఈ క్రింద చెప్పబడినవి కూడా ఉన్నాయి: పశ్చాత్తాపం: శ్రమ అనేది దేవునికి మించి ఈ భూమి మీద దేనిని కూర్చుకోకుండ ఉండటానికి […] - [Exploring John Chapter 1: A Podcast Journey](https://samskarana.co.in/exploring-john-chapter-1-a-podcast-journey/): Exploring John Chapter 1: A Podcast Journey Welcome to our podcast series where we delve into the depths of the Bible, focusing on the profound teachings found in the Gospel of John. In this episode, we will embark on a captivating journey through John Chapter 1. Introduction to John Chapter 1 John Chapter 1 serves as the opening chapter of the Gospel of John, offering a unique perspective on the life and teachings of Jesus Christ. It presents a powerful and poetic introduction to the significance of Jesus as the Word made flesh. The Word Made Flesh One of the […] - [Terms & Conditions](https://samskarana.co.in/terms-conditions/): Effective Date: 20 February 2026Website: www.samskarana.co.in Terms of Service Welcome to Samaskarana.co.in, a dedicated online platform committed to providing superior Christian literature and products. Samskarana is an irrevocable Public Charitable and Religious Trust established in India for spiritual, educational, humanitarian, and community development activities as per its registered Trust Deed  The Trust conducts conferences, seminars, training programs, community events, charitable initiatives, and fundraising activities within India. Acceptance of Terms By accessing this website, registering for events, or making a donation through the website, you agree to be bound by these Terms & Conditions. Nature of Services Samskarana may collect payments […] - [Privacy Policy](https://samskarana.co.in/privacy-policy-2/): Effective Date: 20 February 2026Website: www.samskarana.co.in At SAMSKARANA, we are committed to protecting the privacy and security of our customers’ personal information. This Privacy Policy outlines the types of personal data we collect, how we use it, and the choices our customers have regarding their information. Introduction Samskarana (“Trust”, “we”, “our”, “us”) is a registered Public Charitable and Religious Trust established in India  This Privacy Policy explains how we collect, use, store, and protect personal data when you: By using our website, you consent to the practices described in this Privacy Policy. Personal Data We Collect We may collect the […] - [Bible Study Event](https://samskarana.co.in/bible-study-event/): Bible Study Event Welcome to our Bible Study Event page! Join us as we delve into the teachings of the Bible and explore its timeless wisdom. Whether you are a seasoned believer or just starting your spiritual journey, this event is open to all who seek to deepen their understanding of the scriptures. Event Details Date: [Insert Date] Time: [Insert Time] Location: [Insert Location] What to Expect During our Bible Study event, we will engage in thoughtful discussions, study various passages, and reflect on their relevance to our lives today. Led by experienced facilitators, you will have the opportunity to […] - [వ్యాసాలు](https://samskarana.co.in/articles/) - [స్వేచ్ఛ కానుకలు](https://samskarana.co.in/donate/): జీవితాలను మార్చే సువార్త యొక్క సందేశంతో, మంచి సిద్ధాంతపరమైన బైబిలు బోధనలతో విశ్వాసులను, చాలా సంఘాలను చేరడానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి, మీ ప్రార్థనలు, మీ ఆర్థిక సహాయం మా పరిచర్యకి చాలా అవసరము. ప్రాధమికంగా స్థానిక సంఘమునకు ఇచ్చుట యొక్క ప్రాముఖ్యతను మేము నమ్ముతాము. మీరు మీ స్థానిక సంఘానికి ఇచ్చిన తర్వాత, మా పరిచర్యకు మరింత మద్దతునివ్వడానికి మీరు నడిపించబడ్డారని భావిస్తే, మీ సపోర్ట్ మాకు అనేక విధాలుగా సహాయపడతాయి. ఈ సాహిత్య మరియు మీడియా పరిచర్యలో మాతో కలసి మీ ప్రార్థనలతో మరియు ఆర్థిక సహాయం అందించుటలో సహకరిస్తారా? For Internet Banking/ Cheque/ D.D. Payment If you want to pay by debit card, credit card, or UPI (BHIM), please use the bank details provided above or scan the QR code / మీరు డెబిట్ కార్డ్, […] [comment]: # (Generated by Hostinger Tools Plugin)